అంతర్జాతీయం

భారత్-మాల్టా మధ్య మూడు ఎంఓయూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాలెట్టా, సెప్టెంబర్ 17: భారత్-మాల్టాలు కీలకమైన మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నౌకా వాణిజ్యానికి సంబంధించి, ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. దీనికి సంబధించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాల్టా అధ్యక్షురాలు మారియా లూసే కొలెయిరో పెర్కా మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాలు మూడు ఎంఓయూలపై సంతకాలు చేశాయి. మారిటైమ్ కో-ఆపరేషన్, టూరిజం, డిప్లోమాటిక్ స్టడీస్‌పై ఈ ఒప్పందాలు జరిగాయి. దౌత్యపరంగా, నౌకా వాణిజ్యం, పర్యాటక రంగంలో పరస్పరం కలిసి పనిచేయాలని భారత్-మాల్టా నిర్ణయించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌కుమార్ సోమవారం వెల్లడించారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టత్రి వెంకయ్యనాయుడికి మాల్టా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారని కుమార్ ట్వీట్ చేశారు. విద్య, ఉత్పత్తిరంగం, షిప్పింగ్, టూరిజంపై ఇరుదేశాల ప్రతినిధుల స్థాయి భేటీ జరిగింది. అన్నింటిపైనా సమగ్రంగా చర్చించినట్టు ఆయన తెలిపారు.

చిత్రం..మాల్టా పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ దేశ అధ్యక్షురాలు మారియాతో
సంయుక్త విలేఖరుల సమావేశంలో పాల్గొన్న దృశ్యం.