అంతర్జాతీయం

బ్రిటన్‌లో దంపతులపై విష ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 19: ఓ మోడల్ దంపతులపై రష్యా ప్రభుత్వం విషప్రయోగం చేసిందన్న వార్తలు మరోసారి బ్రిటన్‌లో కలకలం రేపాయి. రష్యా అధ్యక్షడు పుతిన్ తమ హత్యకు కుట్రపన్నారని మోడల్ ఆరోపించింది. ఈ ఏడాది మార్చిలో రష్యా మాజీ ఏజెంట్ సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యూలియా ప్రణాంతమైన ‘నొవిఛోక్’ తీసుకుని అపస్మారక స్థితిలో కనిపించారు. ఇద్దరిపైనా రష్యా ప్రభుత్వమే విషప్రయోగం చేసిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్రిటన్ ప్రధాని థెరిసామే ప్రభుత్వం కూడా రష్యాపై విమర్శలు చేసింది. తాజాగా నైరుతీ ఇంగ్లాండ్‌లోని సాలిస్‌బరీ పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. రెస్టారెంట్‌లో 30 ఏళ్ల మోడల్ అన్నా షాప్రియో, ఆమె భర్త అలెక్స్ కింగ్(42) ఓ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని సిబ్బంది గమనించారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనపై మోడల్ షాప్రియో ‘ద సన్’ పత్రికతో మాట్లాడుతూ పుతిన్ ప్రభుత్వ తమపై హత్యాయత్నం చేసిందని ఆరోపించింది. తమపై ఇద్దరు వ్యక్తులు విషప్రయోగం చేశారని దాని వెనక రష్యా ప్రభుత్వ హస్తం ఉందని ఆమె తెలిపింది. ‘నేను బ్రిటన్ గూడచారినని రష్యా అనుమానిస్తోంది’ అని ఆమె వెల్లడించింది. రష్యా మిలటరీ తన తండ్రి జనరల్‌గా పనిచేశారని ఆమె పేర్కొంది. ప్రెజ్జో రెస్టారెంట్ టాయిలెట్స్‌లో తన భర్త అలెక్స్ కింగ్ కుప్పకూలిపోయాడని, పరుగున వెళ్లి చూడగా నోటి నుంచి నురగలు వస్తున్నాయని అన్నా మీడియాకు తెలిపారు. తనకు కూడా వాంతులు కావడంతో కింద పడిపోయింది. వెంటనే రెస్టారెంట్ వెయిటర్ దంపతులు ఇద్దర్నీ సాలిస్‌బరీ జిల్లా ఆసుపత్రికి తరలించాడు.
అలెక్స్ కోమాలోఉన్నాడు. అతడి ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్వీన్ ఎలిజబెత్ గార్డెన్స్‌కు ప్రెజ్జో రెస్తారెంట్ కూతవేటు దూరంలోనే ఉంటుంది. గతంలో జిజ్జి ఇటాలియన్ రెస్టారెంట్‌లో మాజీ గూడచారి, ఆయన కుమార్తె కూడా ఇదే తరహాలో విషప్రయోగానికి గురయ్యారు. అప్పట్లో ఇది కలకలం రేపడంతో రెస్టారెంట్‌ను శాశ్వతంగా మూసేశారు. తాజాగా చోటుచేసుకున్న అలాంటి ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. మోడల్, ఆమె భర్త ప్రాణాంతక నొవిఛోక్ తీసుకున్నట్టు ఆధారాలు లభించలేదని విల్‌షైర్ పోలీసులు తెలిపారు. కాగా ఉదంతాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని రష్యా ప్రభుత్వం వెల్లడించింది.