అంతర్జాతీయం

షింజో అబే ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 20: జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని షింజో అబే ఘన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో తిరిగి గెలిచిన అబే మీడియాతో మాట్లాడుతూ ‘దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలూ పరిష్కరించేందుకే నాకీ అవకాశం దక్కింది’అని ప్రకటించారు. ఎన్నికల యుద్ధం ముగిసించదని ఇక నిర్ధేశించుకున్న లక్ష్యాలనే చేరుకోవడమే తమ ముందున్న కర్తవ్యమని ప్రధాని షింజో స్పష్టం చేశారు. ‘నవ జపాన్ నిర్మాణానికి అందరం కలిసి పనిచేద్దాం’అని ఆయన పిలుపునిచ్చారు. 2012 డిసెంబర్ నుంచి షింజో అబే ప్రధాన మంత్రిగా పనిచేస్తున్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీపై పట్టుసాధిస్తూ కన్జర్వేటీవ్‌ల మద్దతును చూరగొంటూ అనేక ఆర్థిక, దౌత్య విధానాలు అమలు చేస్తున్నారు. లిబరల్ పార్టీకి మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అబే 2021 వరకూ అధికారంలో ఉంటారు. దేశంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నేతగా ఆయనే్న చెప్పుకోవచ్చు. ఉత్తర కొరియా అణు,క్షిపణుల పరీక్షలు, చైనా దూకుడు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే వయోవృద్ధులు పెరిగిపోవడం, రాచరిక వారసత్వ సమస్య, వినియోగపుపన్ను పెంపువంటి సవాళ్లు ఆయన ముందన్నాయి.‘బలమైన నాయకుడితోనే సుస్థితర ప్రభుత్వం సాధ్యం. ఆర్థిక, దౌత్యపరమైన విధానాల్లోనూ కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. షింజో అబే ఈ విషయంలో సమర్ధవంతగానే పనిచేసి సత్తాచాటుకున్నారు’అని టోక్యో యూనివర్శిటీ రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్ యూ ఉఛియామా అన్నారు.