అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో 18మంది సజీవ సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగా ( ఫిలిప్పైన్స్), సెప్టెంబర్ 20: ఫిలిప్పైన్స్‌లోని మధ్య ప్రాంతంలో పర్వతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 18 మంది సజీవంగా సమాధి అయ్యారు. పర్వతప్రాంతంలోని రెండుగ్రామాల్లో 30 ఇళ్లపై కొండ చరియలు విరిగిపడడంతో విషాద ఘటన చోటుచేసుకుంది. సెబూ ప్రొవిన్స్‌లోని నాగా సిటీకి సమీపంలో జరిగిన ఈ ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలను చేపట్టారు. ఈ సంఘటనలో గాయపడిన ఏడుగురిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో వృద్ధులైన మహిళలు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఫిలిప్పైన్స్‌లో గత వారం సంభవించిన తుపానులో 88 మంది మరణించారు. 60 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. దేశ రాజధానికి 570 కి.మీ దూరంలో ఉన్న నాగా పట్టణంకు సమీపంలో కొండచరియలు విరిగి పడిన ఘటనకు సంబంధించి ఇతర పర్వతప్రాంతాల్లో ముందస్తు చర్యలను చేపట్టింది. తన భర్త, కుమారుడు పనులకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించినట్లుగా శబ్ధం వినపడిందని, భూకంపం సంభవించినంత తీవ్రతతో కొండచరియలు విరిగిపడ్డాయని 53 సంవత్సరాల మహిళ క్రిస్టిటా విల్లార్బ తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో తన భర్త, తాను, ముగ్గురు పిల్లలు క్షేమంగా బయటపడ్డారన్నారు. ఎవరికీ గాయాలు కాలేదన్నారు. తన ఇంటి ముందున్న సోదరుడు లారో కుటుంబమంతా ఈ దుర్ఘటనలో సజీవ సమాధి అయ్యారని ఆమె చెప్పారు. ఇరుగుపొరుగు వారు చాలా మంది రక్షించండి అంటూ చేస్తున్న ఆర్తనాదాలు వినిపించాయన్నారు. తమ కంటి ఎదుటే భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడుతూ దొర్లుకుంటూ వచ్చి ఇళ్లను కూల్చివేశాయన్నారు. ఈ విపత్తు ప్రళయాన్ని గుర్తుకు తెచ్చిందన్నారు. తన సోదరుడి ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారన్నారు. దేశంలో ఉత్తర ప్రాంతంలో ఈ తరహా ఘటన జరిగినప్పుడు బాధపడ్డామన్నారు. ఈ విపత్తు సొంత గ్రామంలో కూడా సంభవిస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు.

చిత్రం..మృతదేహాల కోసం గాలింపు