అంతర్జాతీయం

వర్క్ పర్మిట్ల రద్దుపై 3నెలల్లో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ దంపతులకు పిడుగులాంటి వార్త. హెచ్- 4 వీసాదారుల పని వీసాలను రద్దుచేస్తామంటూ ఇంతకాలం ప్రకటిస్తూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మూడు నెలల్లోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో హెచ్- 1 బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములకు కష్టాలు తప్పని పరిస్థితి వస్తోంది. హెచ్- 4 వీసాదాలు( హెచ్ 1బీ భాగస్వాములకు ఇచ్చే వీసాలు) రద్దు ఖాయమని ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ కోర్టుకు తెలిపింది. మూడు నెలల్లో దీనిపై ఓ అధికారిక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో హెచ్- 4 వీసాదారుల్లో ఆందోళన మొదలైంది. హెచ్ -1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భాగస్వాములు హెచ్-4 వీసాలపై అమెరికాలో పనిచేయవచ్చని ఒబామా ప్రభుత్వం ప్రకటించింది. ఒబామా ప్రభుత్వం నిర్ణయంతో అమెరికన్లు ఉపాధి దొరకడం లేదని ట్రంప్ ప్రభుత్వం చెబు తూ వచ్చింది. వర్క్ పర్మిట్‌ను రద్దు చేస్తామని గతంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దాన్ని కార్యరూపంలో పెట్టబోతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) శుక్రవారం యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్ ఆఫ్ కొలంబియాలో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. హెచ్-4 బీసాల రద్దుపై మూడు నెలల్లో తేల్చేస్తామని కోర్టుకు తెలిపింది. డీహెచ్‌ఎస్ ఇంతకు ముందు ఫిబ్రవరి 28, మే 22, ఆగస్టు 20న కోర్టుకు నివేదికలు అందజేసింది. నవంబర్ 19న మరో నివేదిక ఇవ్వాల్సి ఉంది.