అంతర్జాతీయం

పాక్‌తో చర్చల రద్దుపై ఇమ్రాన్ ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 22: భారత్, పాక్ మధ్య న్యూయార్కులో చర్చల ప్రక్రియను భారత్ ఏకపక్షంగా రద్దు చేయడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని భారత్ దుందుడుకు వైఖరిని తెలియచేస్తుందన్నారు. భారత్ ప్రతికూల నిర్ణయం తనను నిరాశకు గురి చేసిందన్నారు. తన జీవిత కాలంలోదార్శనికత లేని పెద్ద మనుషులు చిన్న బుద్ధులు కలిగి ఉండడాన్ని చూశాను అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌లో ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. దీంతో చర్చలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. పైగా కాశ్మీరీ ఉగ్రవాది బూర్హన్ వానీకి సంబంధించి తపాలా బిళ్లను విడుదల చేయడాన్నికూడా భార త్ గర్హించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో న్యూయార్కులో పాక్, భారత్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ముందుగా ఖరారైంది. కాగా తాజా పరిణామా ల నేపథ్యంలో న్యూయార్కు చర్చలను రద్దు చేస్తున్నట్లు భారత్ విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసలు స్వరూపాన్ని బహిర్గతం చేసిందన్నారు. ఇస్లామాబాద్ చర్చలంటూనే మరో వైపు భారత్‌లో అస్థిరత్వం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గపు అజెండాను తెలియచేస్తోందన్నారు. ఉగ్రవాది బూర్హాన్‌పై పోస్టల్ స్టాంపును విడుదల చేయడం వెనక అజెండా ఏమిటని భారత్ ప్రశ్నించింది. రెండు దుశ్చర్యలకు పాల్పడిన పాకిస్తాన్‌తో మాట్లాడాల్సిన అవసరంలేదని ఆయన పేర్కొన్నారు. భారత్ వైఖరిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ స్పందించారు. భారత్ ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే వాస్తవాలను నిర్ధారించేందుకు ఉమ్మడి తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమన్నారు. బుర్హాన్ పోస్టల్ స్టాంపును జూలై 25వ తేదీ ఎన్నికల ముందు విడుదల చేశారన్నారు. కాగా కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేశారన్నారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత ఉపఖండంలో శాంతిని సాధించాలన్న లక్ష్యానికి భారత్ తూట్లు పొడిచిందన్నారు.