అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో మళ్లీ పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 7: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనను మరువక ముందే గురువారం మరోసారి ఆ దేశం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఢాకాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషోర్ గంజ్ జిల్లాలోని షోలాకియా ఈద్గా మైదానం సమీపంలో గురువారం ఉదయం పోలీసులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. దాడి సమయంలో ఈద్గా మైదానంలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేస్తున్నారు. బాంబులు విసిరిన ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆ తర్వాత పోలీసులపై కాల్పులు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసులు చనిపోగా, మరో 13 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. ఒక కానిస్టేబుల్ సంఘటన స్థలంలో మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో పోలీసు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనను తన ఇంటి కిటికీలోంచి చూస్తున్న ఓ మహళ కూడా చనిపోయినట్లు స్థానిక దినపత్రిక తెలిపింది. ఒక అనుమానితుడ్ని పట్టుకోవడం జరిగిందని, దాదాపు 13 మంది గాయపడ్డారని కిషోర్ గంజ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ అబూ సయేమ్ చెప్పారు. ఈద్గా మైదానంలోకి వచ్చేవారిని పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో ఆరేడు మంది పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ పేలుళ్లు మైదానం వద్ద చేరుకుంటున్న జనంలో భయాందోళనలను సృష్టించాయని, అయితే ప్రార్థనలు మాత్రం యథాప్రకారం జరిగాయని కిషోర్ గంజ్ ఎఎస్‌పి ఒబైదుల్ హసన్ చెప్పినట్లు ‘బిడిన్యూస్ 24 డాట్‌కామ్’ తెలిపింది. బహుశా అది పెట్రోలు బాంబు అయి ఉండవచ్చని, వాస్తవాలు ఇంకా స్పష్టంగా తెలియదని ఆయన చెప్పారు.
గత వారం ఢాకాలో ఉగ్రవాదుల దాడిలో 22 మంది చనిపోయిన దారుణ సంఘటనలను మరువక ముందే ఈ దాడి జరగడం గమనార్హం.

చిత్రం.. బంగ్లాదేశ్‌లో గురువారం పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు