అంతర్జాతీయం

నాటి భారత్ సైనికులకు మిగిలింది నిరాదరణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 23: మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున అవిభక్త భారత్ నుంచి దాదాపు 1.3 మిలియన్ల మంది సైనికులు యుద్ధం చేశారు. కాని వారి పట్ల బ్రిటన్ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని చెప్పేందుకు కీలకమైన డాక్యుమెంట్లు లభించాయి. ఈ వివరాలు బ్రిటన్ లైబ్రరీలోని డాక్యుమెంట్లలో అప్పటి ఆర్మీ డాక్టర్లు పొందుపరిచారు. భారత్‌కు చెందిన కొంత మంది కళాకారులు, పరిశోధకులు ఈ అంశంపై ఈ లైబ్రరీలోని డాక్యుమెంట్లను పరిశీలించారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమై 1918 వరకు జరిగింది. ఈ యుద్ధం ముగిసి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రిటన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలను గత నాలుగేళ్లుగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల ముగింపు కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నారు. లైబ్రరీ డాక్యుమెంట్ల వివరాలపై శుద్ధబ్రాత సేన్‌గుప్తా పరిశోధనలు చేశారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత పెద్ద యుద్ధంగా మొదటి ప్రపంచ యుద్ధం నమోదైంది. 70 మిలియన్ల మిలిటరీ జవాన్లు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటీష్ ఇండియాలో అనేక మంది భారతీయులు ఈ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడారు. కాని వారి బాధలను బ్రిటన్ పట్టించుకోలేదు. భారతీయ సైనికులు ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. మానసిక అనారోగ్యానికి లోనయ్యారు. కాని వారికి సరైన వైద్యం లభించలేదు. తీవ్రమైన నిరాదరణకు గురయ్యారు. వెన్నముక దెబ్బతిని అనేక మంది భారతీయులు తీవ్రమైన అనారోగ్యంతో సతమతమయ్యారు. ఈ వివరాలను ఒక బ్రిటన్ డాక్టర్ నమోదు చేశారు.