అంతర్జాతీయం

ఇమ్రాన్‌ది దౌత్య వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 23: భారత్‌తో చర్చలకు ఎందుకు తొందరపడ్డారని, ఈ విషయంలో ముందుగా అవసరమైన ప్రణాళిక లేకుండా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దూకుడుగా వ్యవహరించడం తగదని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఇరుదేశాల మంత్రుల మధ్య మీటింగ్ అంటే ప్రత్యేక వ్యూహ రచన, ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు. దౌత్యపరంగా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి కావడానికి ఇమ్రాన్ చర్యలు దోహదపడుతాయన్నారు. పాక్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే ఇమ్రాన్ ఖాన్ భారత్ ప్రధాని నరేంద్రమోదీకీ లేఖ రాశారు. శాంతి సాధనకు ద్వైపాక్షిక చర్చలు అవసరమని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల నేపథ్యంలో న్యూయార్కులో పాకిస్తాన్‌తో చర్చించేందుకు తొలుత భారత్ అంగీకరించింది. ఈ చర్చల్లో పాక్ మంత్రి షా మహ్మద్ ఖురేషీ, భారత్‌మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొనాల్సి ఉందన్నారు. కాగా కాశ్మీర్‌లో రెండు రోజుల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థకుచెందిన సభ్యులు దాడి చేసి ముగ్గురు పోలీసులను అపహరించి కాల్చి చంపారు. ఈ ఘటనతో ఒక్కసారి ఉభయ దేశాల మధ్య వాతావరణం వేడెక్కింది. ఈ చర్చలను రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ వైఖరిని నవాజ్ షరీఫ్‌పార్టీ, భుట్టో పార్టీలు రెండూ వ్యతిరేకించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదంపైచర్చకు సిద్ధంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారని, దీనర్ధం దేశంలో ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నట్లు అంగీకరించినట్లయిందని ప్రతిపక్షపార్టీలు ధ్వజమెత్తాయి. ఈ చర్చల రద్దుతో పాకిస్తాన్ బలహీనత బయటపడినట్లయిందన్నారు. భారత్‌తో చర్చలకు తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో ఆచితూచి మాట్లాడాల్సిన బాధ్యత పాక్ పాలకులపై ఉందని నవాజ్ పార్టీ నేత ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు అమెరికా, భారత్‌లు పథక రచన చేస్తున్నాయని ఆయన చెప్పారు. దౌత్య నీతిలోముందుగా బలహీనతను చాటుకోరాదన్నారు. ప్రధాని మోదీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దుందుడుకుగా ఈ చర్చల ప్రక్రియను నిలిపివేశారన్నారు. భుట్టో పార్టీ కార్యదర్శి షెర్రీ రెహమాన్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం తొందరపడి చర్చలను రద్దు చేసిందని, ఇది అపరిపకత్వ నిర్ణయమని పేర్కొన్నారు. భారత్ అన్ని ప్రోటాకాల్స్ నిబంధనలను పాటించకుండా చర్చలను రద్దు చేసుకోవడం నిజంగా దురదృష్టకరం , తొందరపాటు చర్యని చెప్పారు.