అంతర్జాతీయం

ఐరాసకు ఏ హక్కుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగన్, సెప్టెంబర్ 24: ఐరాసపై మైన్మార్ సైనికాధినేత ధిక్కార స్వరాన్ని వినిపించారు. మైన్మార్ స్వార్వభౌమత్యానికి సంబంధించిన అంశాలపై జోక్యం చేసుకునే అధికారం ఐక్యరాజ్య సమితికి ఎంత మాత్రం లేదని ఆర్మీచీఫ్ మిన్ అంగ్ హాయింగ్ తేల్చిచెప్పారు. రోహింగ్యాల ఊచకోతకు సంబంధించి ఆర్మీచీఫ్, ఇతర సైనిక జనరళ్లను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఐరాస దర్యాప్తు బృందం సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయన తీవ్ర స్వరంతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రోహింగ్యాల ఊచకోత అంశంపై మైన్మార్ సైనికాధికారుల్ని అంతర్జాతీయ కోర్టుకీడ్చాలంలటూ ఐరాస బృందం భద్రతా మండలికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో రోహింగ్యాల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండటంతో మైన్మార్ ఏకంగా ఈ అంతర్జాతీయ సంస్థమైనే ధ్వజమెత్తడం గమనార్హం. ఓ దేశ సార్వభౌమత్వం విషయంలో జోక్యం చేసుకునే హక్కు, అధికారం ఏ దేశానికి, సంస్థకు, బృందానికి ఉండదని అంగ్ హాయింగ్ తెగేసి చెప్పారు.

చిత్రం..ఆర్మీచీఫ్ మిన్ అంగ్ హాయింగ్