అంతర్జాతీయం

అమెరికా, జపాన్ వైద్యులకు నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోం, అక్టోబర్ 1: శరీరంలో ఉండే సహజసిద్ధమైన నిరోధక వ్యవస్థ ద్వారానే కేన్సర్ మహమ్మారిని అంతం చేసే సరికొత్త చికిత్సా విధానానికి అంకురార్పణ చేసిన అమెరికా, జపాన్ వైద్యులకు వైద్యశాస్త్రంలో సమున్నత నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన జేమ్స్ అలిసన్, జపాన్‌కు చెందిన అసుకుహోంజో ఈ అవార్డును సంయుక్తంగా పంచుకున్నారు. వీరిద్దరూ రూపొందించిన కొత్త చికిత్సా విధానం వల్ల శారీరక రోగనిరోధక శక్తి పెంపొందుతుందని, ఆ విధంగా కేన్సర్ కణాలను నిరోధించగలుగుతుందని నోబెల్ సంస్థ తెలిపింది. కేన్సర్ కణాల్లోని కొన్ని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని వీరిద్దరూ కొత్త థెరపీని తెరపైకి తెచ్చారు. టెక్సాస్ యూనివర్సిటీ ఎన్యుమాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అలిసన్, అలాగే క్యోటో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉంటున్న గౌల్‌జోలకు 2014లోనే ఆసియా నోబెల్‌గా భావించే ప్యాంగ్ పురస్కారం లభించింది.
వీరిద్దరికీ డిసెంబర్ 10న స్టాక్‌హోంలో ఈ నోబెల్‌పురస్కారాన్ని అందిస్తారు.

చిత్రాలు.. జేమ్స్ అలిసన్ * అసుకు హోంజో