అంతర్జాతీయం

మా వైఖరిలో మార్పులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 3: పాకిస్తాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం అనుసరిస్తున్న వైఖరిలో ఇప్పటికిప్పుడే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు లేవు. ముఖ్యంగా పాకిస్తాన్‌కు అమెరికా చేసే ఆర్థిక సాయాన్ని కొన్నాళ్ల క్రితం నిలిపివేసిన ట్రంప్ పాలనాయంత్రాంగం దాన్ని ఇప్పట్లో తిరిగి పునరుద్ధరించే అవకాశాలు కనిపించడం లేదు. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న ఉగ్రవాదులను అణచివేయడంలో, తన గడ్డపై ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంలో గణనీయమయిన పురోగతి సాధించిందని తాను విశ్వసించే వరకు అమెరికా పాకిస్తాన్‌కు ఆర్థిక సాయాన్ని పునరుద్ధరించదు. ఇదే విషయాన్ని ట్రంప్ పాలనా యంత్రాంగం పాకిస్తాన్ ఉన్నతాధికారులకు తేల్చిచెప్పింది. అమెరికా- పాకిస్తాన్ మధ్య దెబ్బతిన్న సంబంధాలను మెరుగు పరచుకోవాలనే ఉద్దేశంతో ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి నేతలు ఇక్కడ సమావేశమయ్యారు. ఇందులో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పోంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్.. పాకిస్తాన్ కొత్త విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషితో విడిగా భేటీ అయ్యారు. పాకిస్తాన్ గడ్డపై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై తాము చర్యలు తీసుకోవడం ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు పాకిస్తాన్ క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలలో ఎలాంటి పురోగతి లేదని వారు ఖురేషికి చెప్పినట్టు భావిస్తున్నారు. తాలిబన్లపై పాకిస్తాన్ ప్రభావం ఉందని గట్టిగా విశ్వసిస్తున్న ట్రంప్ పాలనాయంత్రాంగం.. తాలిబన్లను చర్చలకు తీసుకు రావడం ద్వారా సుమారు 17ఏళ్లుగా అఫ్గానిస్తాన్‌లో సాగుతున్న పోరుకు ముగింపు పలకాలని కూడా ట్రంప్ పాలనాయంత్రాంగం పాకిస్తాన్‌ను కోరింది. అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం ఫాగి బాటమ్‌లో సుమారు 20 నిమిషాల సేపు ఖురేషి, పోంపియో మధ్య చర్చలు సాగినట్టు భావిస్తున్నారు.