అంతర్జాతీయం

మానవతా దృక్పథంతో వ్యవహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేగ్, అక్టోబర్ 3: అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్‌లో అమెరికాకు చుక్కెదురైంది. ఇరాన్‌పై విధించనున్న ఆంక్షలను మానవతా దృక్పథంతో నిలుపుదల చేయాలని ఐరాస అంతర్జాతీయ న్యాయస్థానం అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ దేశంపై విధించిన ఆంక్షల ప్రతిపాదనను అమెరికా ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరాన్ అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టింది. టెహ్రాన్‌తో ఒబామా ప్రభుత్వం గతంలో ఖరారు చేసి అణు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. అమెరికా విధించనున్న ఆంక్షలు 1955 నాటి స్నేహపూర్వక ఒప్పందానికి తూట్లు పొడిచే విధంగా ఉందని హేగ్ న్యాయస్థానం తీర్పులో పేర్కొంది. ఇరాన్‌కు ఫార్మా మందులు, ఔషధాలు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఏకపక్షంగా విధించిన ఆంక్షలను అమెరికా ఉపసంహరించుకోవాలని తీర్పులో న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ తీర్పును ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ ఖావి అహ్మద్ యూసుఫ్ వెలువరించారు. మానవతా దృక్పథంతో కొన్ని సరకుల ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ఉపసంహరించుకోవాల్సి ఉందని కోర్టు పేర్కొంది. కొన్ని లక్షల మంది ప్రజలు ఈ మందులపై ఆధారపడి జీవిస్తున్నారని కోర్టు తెలిపింది. ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు నెలలో మొదటి విడత ఆంక్షలను అమలు చేసింది. రెండవ విడత ఆంక్షలను వచ్చే నవంబర్ నుంచి అమెరికా అమలు చేయనుంది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ జావేద్ మాట్లాడుతూ ఈ ఆంక్షలు మానసిక ఆందోళన పెంచే విధంగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక యుద్ధంతో ప్రపంచ దేశాల్లో భయోత్పాదాన్ని సృష్టించడం అమెరికాకు తగదన్నారు. హేగ్ న్యాయస్థానంలో గత ఆగస్టులో నాలుగు రోజుల పాటు ఇరాన్‌కు చెందిన న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా అమెరికా మాత్రం హేగ్ న్యాయస్థానానికి ఈ కేసు విచారించే పరిధి లేదని, జాతీయ భద్రత దృష్ట్యా తమ దేశానికి ఆంక్షలను విధించే హక్కు ఉందని స్పష్టం చేసింది.