అంతర్జాతీయం

సింగపూర్‌లో మహాత్ముని జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, అక్టోబర్ 3: గాంధీ మహాత్ముని 150 జయంతి వేడుకలు సింగపూర్‌లో ఘనంగా నిర్వహించారు. సన్‌టెక్ సిటీ కనె్వన్షన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సింగపూర్ చైనీస్ ఆర్కెస్ట్రా ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే పాటను ఆలపించి గాంధీ జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌లో గాంధీ జీవిత విశేషాలను తెలియజేసే నాలుగు నిముషాల వీడియోను ప్రదర్శించారు. కాగా, మహాత్మునికి స్మతి చిహ్నంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని క్లిఫర్డ్‌లో ఈ ఏడాది జూన్ రెండున భారత ప్రధాని నరేంద్రమోదీ, సింగపూర్ సీనియర్ మంత్రి గోచోక్‌టాంగ్ సంయుక్తంగా ఆవిష్కరించిన సందర్భంలోనూ ఈ ఆర్కెస్ట్రా వారు ఐదు నిముషాల పాటను కంపోజ్ చేశారు. మహాత్ముడు తన జీవిత కాలంలో ఎన్నడూ సింగపూర్‌ను కాని, ఈ ప్రాంతాన్ని కాని దర్శించలేదు. అయితే ఇక్కడి ప్రజలకు గాంధీజీ మానసికంగా దగ్గరయ్యాడని కార్యక్రమంలో పాల్గొన్న భారత హై కమిషనర్ జావెద్ అషారఫ్ వెల్లడించారు. ఆయన బోధనలు, సూక్తులు, అహింసావిధానం, సత్యనిష్టకు ఇక్కడి ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని ఆయన చెప్పారు. గాంధీజీ మరణ వార్త విని ఇక్కడి ప్రజలు హతాశులయ్యారని, స్తబ్దత నెలకొందని, ఆయన మృతికి సంతాపంగా కొందరైతే 13 రోజుల ఉపవాసాన్ని కూడా చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన స్మృత్యర్థం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి సింగపూర్ నేత రాజబలి జుమాభోయ్ ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా లక్ష సింగపూర్ డాలర్లను సేకరించారు. అనంతరం 1953లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మహాత్ముని చితాభస్మాన్ని సింగపూర్‌కు తీసుకుని వచ్చి ఇక్కడి సముద్రంలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పదివేల మందికి పైగా స్థానికులు పాల్గొన్నారని ఆయన వివరించారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా స్థానిక ఇండియన్ స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులకు క్విజ్, గాంధీ చరిత్ర తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. ఇలావుండగా, గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగే కార్యక్రమంలో గాంధీ మనవరాలు ఎలాబెన్ గాంధీ ఉత్సవాలలో పాల్గొంటారు.