అంతర్జాతీయం

చర్చలకు వెళ్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 22: చర్చల ద్వారానే కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందుని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. చర్చలకు భారత్ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గావ్ జిల్లాలో ఆదివారం నాడు పేలుళ్లలో ఆరుగురు పౌరులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ ఘటనా స్థలంలో ఇది చోటుచేసుకుంది. దీనిపై పాక్ ప్రధాని తీవ్రంగానే స్పందించారు.‘కాశ్మీరీల వరుస మరణాలు అత్యంత దారుణం. భారత భద్రతాదళాల చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా’అంటూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య జఠిలంగా మారిన కాశ్మీర్ అంశంపై చర్చలు జరగాలని, భారత్ ముందుకు రావాలని ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఐరాస తీర్మానానికి అనుగుణంగా చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. కాగా కుల్గావ్ జిల్లాలో ఆదివారం నాటి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో సంభవించిన పేలుళ్లలో ఆరుగురు పౌరులు మరణించారు. కాశ్మీర్ సమస్యపై ఖాన్ మాట్లాడుతూ ‘ఇలాంటి ఘటనలు కొత్తకాదు’అని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలకు చర్చలే పరిష్కారమని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. భారత్-పాక్ మధ్య మంచి సంబంధాలుంటేనే ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.