అంతర్జాతీయం

ఐరాసను అలరించనున్న సరోద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, అక్టోబర్ 23: మనసుదోచే సరోద్ మాస్ట్రో అంజాద్ అలీఖాన్ సంగీత ఝరి ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రతిధ్వనించనుంది. మహాత్మాగాంధీకి నివాళిగా బుధవారం నాడాయన ఐరాస వార్షిక సదస్సులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ‘అహింసా సిద్ధాంతానికి ఆలంబనగా సాగనున్న ఈ కార్యక్రమం చరిత్రను మారుస్తుంద’ని ఐరాస చీఫ్ ఆంటోనియో గట్టర్స్ పేర్కొన్నారు. ఐరాస వేధికపై భారత ప్రభుత్వం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఒకరోజు మొత్తం సరోద్ మాస్ట్రో అంజాద్ అలీఖాన్ కచేరీ సాగనుంది. అంజాద్‌తోబాటు ఆయన కుమారులు అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. లిధియాకు చెందిన శరణార్ధి యాంకోవ్‌స్కాయా నేతృత్వంలో ఈ కార్యక్రమానికి ఆర్కెస్ట్రా ఏర్పాటైంది. ఐరాస సర్వసభ్య సమావేశ వేధికపై జరిగే ఈ కచేరీ కార్యక్రమం ఈ యేడాది ‘శాంతి, అహింసా సంస్కృతి’ అనే అంశంపై జరుగనుంది. ఈ యేడాది మొత్తం కచేరీ నిర్వహణ బాధ్యతలను భారత్ చేపట్టడం అభినందనీయమని గట్టర్స్ అన్నారు. తాను ఈనెల తొలినాళ్లలో భారత్‌లో పర్యటించి వచ్చానని, ఇప్పుడిక్కడ అహింస, శాంతి సందేశాలతో కూడిన సంగీత కచేరీ ఏర్పాటు చేయడం తనకు మధురానుభూతిని కలిగిస్తోందని ఆయన అన్నారు, దాదాపుగా ఐరాస సిద్ధాంతం కూడా ఇదేనని, సహనం, ధృఢత్వం, విలువలను గత 73 సంవత్సరాల నుంచి ఐరాస అనుసరిస్తోందని అన్నారు, అహింసా సిద్ధాంతం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మాగాంధీ ఐరాసలో ఇప్పుడు భారత్ నిర్వహిస్తున్న శాంతి సందేశ కార్యక్రమాన్ని తిలకించివుంటే ఎంతో అనందించేవారని గట్టర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అహింసా సిద్ధాంతం ఒక్కటే చరిత్రను మార్చగలదని ఆయన అన్నారు.