అంతర్జాతీయం

జపాన్ వర్శిటీ వివక్షపై మహిళల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 24: ఇక్కడి మెడికల్ కళాశాల అడ్మిషన్లలో మహిళల ప్రాధాన్యతను తగ్గించేందుకు కావాలని మార్కుల జాబితాల్లో మార్పులు చేశారని దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో తమకు జరిగిన అన్యాయానికి సీట్లు కోల్పోయిన మహిళా అభ్యర్థులు నష్టపరిహారాన్ని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. న్యాయవాదుల కథనం మేరకు టోక్యో వైద్య విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న సుమారు 20 మంది మహిళలు ఇలా పరిహారాన్ని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించిన దర్యాప్తులో ఇలాంటి ఉదంతాలే మరికొన్ని మెడికల్ స్కూళ్లలో సైతం వెలుగుచూస్తున్న క్రమంలో మహిళల పట్ల వివక్షను రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని, చట్టంలోకూడా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. 2006లోప్రవేశ పరీక్షరాసిన అనంతరం కళాశాలల్లో అడ్మిషన్లకు నోచుకోని అనేకమంది మహిళలు విశ్వవిద్యాలయాన్ని వచ్చేవారం పరిహారంకోరే అవకాశం ఉందని న్యాయవాదులు చెప్పా రు. తమకు సీట్లు రాకపోవడానికి వివక్ష కారణమా, లేక ప్రవేశ పరీక్షలో వచ్చిన తక్కువ మార్కులా అన్న అంశంపై తమకింకా స్పష్టత రాలేదని, ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం తేటతెల్లం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తాము ఎదుర్కొన్న మానసిక క్షోభకు పరిహారంగా లక్ష యెన్‌లు పరిహారంగా చెల్లించాలని, అలాగే ప్రవేశ పరీక్షకు చెల్లించిన సొమ్ములు, పాఠశాలకు రాకపోకలకు, అక్కడ ఉండేందుకు భరించిన ఖర్చులను సైతం రీయింబర్స్ చేయాలని బాధితులు కోరుతున్నారని న్యాయవాదులు తెలిపారు. ఇప్పటికే ఈ బాధితుల్లో పలువురు ఇతర శాఖల్లో ఉద్యోగాలు పొందారు. కాగా ఈ కుంభకోణంపై జరిగిన దర్యాప్తు సందర్భంగా మార్కుల్లో మార్పులు చేసిన విషయాన్ని విశ్వవిద్యాలయం అంగీకరించింది. సుమారు 25 మంది మహిళలు ఈ కారణంగా సీట్లు కోలోయారని దర్యాప్తు సంస్థ తేల్చింది. మహిళలు ఉద్యోగాల్లో చేరిన తర్వాత పెళ్లి, సంసార బాధ్యతలతో మధ్యలోనే ఉద్యోగ బాధ్యతలను విడిచిపెట్టేస్తారని, అందువల్ల ప్రవేశ పరీక్షల్లో వారికి మార్కులు తగ్గించాలని విశ్వవిద్యాలయం భావించిందని న్యాయవాది సాకురా ఉచికోషి తెలిపారు.