అంతర్జాతీయం

సోయజ్ రోదసీ నౌకను ప్రయోగించిన రష్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, అక్టోబర్ 25: రష్యన్ మిలిటరీ అవసరాల నిమిత్తం రష్యా గురువారం సోయజ్ అనే రోదసీ నౌకను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. ఈ తరహా రోదసీ నౌకను ఈ నెల 11వ తేదీన ప్రయోగించగా, సాంకేతిక కారణాల వల్ల విఫలమైంది. భారత కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు రోదసీ నౌక ప్రయోగం విజయవంతమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశించిన కాలపరిమితిలో కక్షలోకి రోదసీ నౌక చేరింది. ఈవివరాలను రష్యా అంతరిక్ష ఏజన్సీ చీఫ్ మిత్రీ రోగోజిన్ ట్వీట్‌లో తెలిపారు. రష్యాలోని ఉత్తరాది ప్రాంతంలోని ప్లెస్టేక్స్ అంతరిక్ష ప్రయోగ శాల నుంచి రోదసీ నౌకను ప్రయోగించినట్లు ఆయన చెప్పారు. 2020 నాటికి రష్యా సోయజ్ 2.1 సీరిస్ రోదసీ నౌకలను ప్రయోగించే స్థితికి చేరుకోవాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.