అంతర్జాతీయం

ముదురుతున్న సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 28: శ్రీలంక రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రధాని పదవి నుంచి విక్రమ్‌సింఘేను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న దేశ అధ్యక్షుడు సిరిసేన నిర్ణయానికి విరుద్ధంగా పార్లమెంట్ స్పీకర్ విక్రమ్‌సింఘేనే ప్రధానిమంత్రిగా ప్రకటించడం సర్వత్రా అక్కడి పరిణామాల పట్ల ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంతకూ విక్రమ్‌సింఘే పదవిలో ఉన్నాడా, లేడా అన్నది సందిగ్ధంగానే కన్పిస్తోంది. ఈనేపథ్యంలో లంకలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పులు కూడా జరిగాయి. కాల్పుల్లో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. శ్రీలంక దేశ ప్రధానిగా రాణిల్ విక్రమ్‌సింఘేను గుర్తిస్తున్నట్టు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ఆదివారం ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి తానీ చర్య తీసుకున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. దీంతో శుక్రవారం ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన నుంచి నాటకీయ పరిణామాల మధ్య తొలగింపునకు గురైన ఈ యూఎన్‌పీ నేతకు ఇది ఉపశమనం కలిగించింది. పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేయాలని ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సిరిసేనకు స్పీకర్ కరు జయసూర్య ఒక లేఖ రాసారు. ఈ పరిణామాలు ఎంతమాత్రం వాంఛనీయం కావని అన్నారు. విక్రమసింఘే హక్కులను రక్షిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన ప్రెసిడెంట్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా విక్రమ్‌సింఘేను తొలగిస్తూ మహేంద్ర రాజపక్సని నూతన ప్రధానిగా ప్రకటిస్తూ అధ్యక్షుడు సిరిసేన శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే తన మెజారిటీ నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని విక్రమ్ సింఘే కోరిన నేపథ్యంలో పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు వాయిదావేస్తూ సిరిసేన శనివారం నిర్ణయించారు. అంతేకాకుండా విక్రమ్‌సింఘే వ్యక్తిగత సెక్యూరిటీ, వాహనాలను తొలగించారు. ఈ పరిణామాలపై స్పీకర్ కలత చెంది జోక్యం చేసుకున్నారు. పార్లమెంట్‌ను వాయిదా వేసే అధికారం ఒక్క స్పీకర్‌కు మాత్రమే ఉందని, దేశ అధ్యక్షుడు నవంబర్ 16 వరకు పార్లమెంట్‌ను వాయిదా వేయడం సరికాదని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై అధ్యక్షుడు తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు. అలాగే విక్రమ్‌సింఘేకు భద్రతను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా, రాజపక్సకు 99 సీట్లు ఉండగా మెజారిటీకి కావాల్సిన 113 సీట్లకు 14 తక్కువయ్యాయి. అదే సమయంలో యూఎన్‌పీకి 105 సీట్లు ఉండటంతో మెజారిటీకి కేవలం 8 సీట్ల దూరంలో ఉంది. మార్క్సిస్ట్ జేవీపీ ఆరు, తమిళ నేషనల్ అలియన్స్ (టిఎన్) 16 సీట్లతో తటస్థంగా ఉన్నాయి. అయితే తమకు మద్దతు ఇవ్వాలని రాజపక్స టిఎన్‌ఏ నాయుకుడు సంపనాథన్‌ను టెలిఫోన్‌లో సకోరారు.
దురంహకార పూరితంగా వ్యవహరించడం వల్లే...
దురంహకారపూరితంగా వ్యవహరించడం వల్లే విక్రమ్‌సింఘేను పదవి నుంచి తప్పించామని, రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారమే రాజపక్సను ప్రధానిగా నియమించానని లంక అధ్యక్షుడు మైత్రిపాల్ స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతినుద్దేశించి మాట్లాడుతూ దేశప్రధానిగా విక్రమ్‌సింఘే వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. 2015లో విజయం సాధించినప్పటి నుంచి ప్రధాని పదవికి తగ్గట్టుగా ఆయన వ్యవహరించలేదని అన్నారు. అధికారం అన్నది తనచుట్టూ ఉన్నవారికోసం అన్నట్టుగా విక్రమ్‌సింఘే ప్రవర్తించారని, సామాన్యుడి సంక్షేమం గురించి పట్టించుకోలేదని అన్నారు.
లంక పరిణామాలను గమనిస్తున్నాం
శ్రీలంకలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను లోతుగా పరిశీలిస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. ఎలాంటి మార్పులు జరిగినా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడేలా రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. తాజాపరిస్థితులపై మాట్లాడిన విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్‌కుమార్ ‘మిత్రదేశమైన లంకకు అభివృద్ధి పరంగా అన్నివిధాలుగా సాయపడతాం, ఆ దేశంలో చేపట్టిన ఎన్నో ప్రాజెక్టుల్లో భాగస్థులై భారత్ సహకరిస్తోంది’ అని అన్నారు.

చిత్రం..పెట్రోలియం మంత్రిత్వశాఖ భవనం వద్ద శ్రీలంక భద్రతాదళాల మోహరింపు