అంతర్జాతీయం

వెల్లివిరిసిన సుహృద్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యమనాషి (జపాన్), అక్టోబర్ 28: భారత్, జపాన్ మధ్య స్నేహ సంబంధాలు చారిత్రాత్మకమైనవని, ఇరుదేశాలు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో పరస్పర సహకారంతో ముందడుగు వేస్తాయని జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇక్కడకు చేరుకున్నప్పుడు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వౌండ్ ఫూజీలోని అందమైన రిసార్ట్‌లో మోదీ బస చేశారు. ఈ సందర్భంగా మోదీ ఇండస్ట్రియల్ రోబో మ్యానుఫ్యాక్చర్ సంస్థను ఎనిమిది గంటల సేపు సందర్శించారు. శనివారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్న మోదీ 13వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు బలమైనవన్నారు. మోదీకి జపాన్ ప్రధాని షింజో అబే ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీని కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని షింజో అబే తెలిపారు. పారిశ్రామిక రోబో తయారీ సంస్థను సందర్శించిన మోదీ టెక్నాలజీని చూసి ముగ్ధుడయ్యారని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీష్ కుమార్ పేర్కొన్నారు. ఒక మోటార్‌ను 40 సెకన్లలో రోబోలు అసెంబ్లింగ్ చేసే టెక్నాలజీ జపాన్ కనిపెట్టింది. ఇద్దరు ప్రధానులు దాదాపు ఎనిమిది గంటల సేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. సోమవారం ఇరుదేశాల ప్రధానులు వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. వీరు జపాన్‌లో 3776 ఎత్తున్న వౌంట్ ఫూజీ పర్వతాల మధ్య ఉన్న రిసార్ట్‌లో బస చేసి ప్రపంచ దేశాల్లో నెలకొన్న స్థితి గతులు, రాజకీయ పరిణామాలు, సైన్స్, టెక్నాలజీ, వాణిజ్య రంగంలో పెట్టుబడులు అంశాలపై చర్చించారు. ఆర్థిక, భద్రతా రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాల ప్రధానులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తాను గత నాలుగున్నరేళ్లలో జపాన్ ప్రధాని షింజే అబేను కలుసుకోవడం ఇది 12వసారి అన్నరు. తాము ఇరువురుం కలిసి భారత్‌లో అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలపై చర్చించామ న్నారు. ప్రాంతీయ భద్రత అంశం కూడా చర్చకు వచ్చినట్లు మోదీ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సాధనకు భారత్ కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ముంబయి అహ్మదాబదా హై స్పీడ్ రైల్, ఫ్రైట్ కారిడార్స్ తదితర నిర్మాణాల్లో జపాన్ పాత్రను ఆయన స్వాగతించారు. భారత ఆర్థిక భవిష్యత్తు పట్ల జపాన్ ఇనె్వస్టర్లకు అపారమైన నమ్మకం ఉందని ఆయన ఆకాంక్షించారు. మోదీ సోమవారం టోక్యోలో భారత్-జపాన్ వాణిజ్య వేత్తలు, భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇరుదేశాల ప్రధానుల మధ్య జరిగిన తొలి విడత చర్చలు ఫలప్రదమయ్యాయని భారత్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ జపాన్ ప్రధానికి విలువైన అపురూపమైన కానుకలను బహుకరించారు. జోధ్‌పూరి కలప బొమ్మలు, పసుపు, రోజ్ క్వార్జ్‌తో తయారు చేసిన రాతి చిప్పలు, రాజస్తాన్, గుజరాత్‌కు చెందిన తివాచీలు, సంప్రదాయ హస్తకళల ఉత్పత్తులను బహుకరించారు.