అంతర్జాతీయం

ఇండోనేసియాలో ఘోర విమాన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, అక్టోబర్ 29: ఇండోనేసియాలో సోమవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 189 మంది దుర్మరణం చెందారు. జకార్తా నుంచి బెలిటంగ్ టూరిస్టు కేంద్రానికి బయలు దేరిన బోయింగ్-737 మాక్స్ విమానం 13 నిముషాల్లోనే రాడార్ పరిధి నుంచి అదృశ్యమై జావా సముద్రంలో కుప్పకూలిపోవడంతో ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భారత పైలటే దీన్ని నడుపుతున్నట్టుగా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లయన్ ఎయిర్ అనే ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెంది ఉంటారని, కొందరి మృతదేహాలు తమకు లభించాయని అధికారులు తెలిపారు. మిగతావాటి కోసం విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ ఎవరూ సజీవంగా బయటపడే అవకాశం లేదని వెల్లడించారు. ఇండోనేసియా రాజధాని జకార్తాకు తిరిగి వచ్చేయాలని పైలట్‌కు సంకేతాలు పంపిన స్వల్ప వ్యవధిలోనే ఈ సంఘటన జరిగిందన్నారు. ప్రమాద కారణాలపై భిన్న కథనాలు వెలువడ్డాయి. ఫ్లయిట్ డేటాను బట్టి చూస్తే.. అతివేగంగా వెళుతున్న ఈ జెట్ విమానం ఆకస్మికంగా ఎత్తు తగ్గిపోయి రాడార్ నుంచి అదృశ్యమైనట్టుగా తెలుస్తోంది. ఈ విమానం సముద్రంలో కూలిపోవడాన్ని తాము కళ్లారా చూశామని ప్రత్యక్ష సాక్షులు కూడా
వెల్లడించారు. ప్రమాదం జరిగి చాలా గంటలైనందున 189మందిలో ఎవరూ బతికే అవకాశం ఉండదని, అయినప్పటికీ గాలింపు చర్యల్ని విస్తృతంగా చేపడుతున్నామని సహాయ ఏజెన్సీ డైరెక్టర్ బామ్‌బ్యాంగ్ సుర్యో తెలిపారు. దాదాపు 40మంది ఈతగాళ్లు సహా మొత్తం 150మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని, జావా సముద్రంలో విస్తృతంగా మృత దేహాల గాలింపు జరుగుతోందని చెప్పారు. కుప్పకూలిన విమాన శకలాలు కూడా 30 నుంచి 40మీటర్ల లోతులోకి వెళ్లిపోయి ఉండవచ్చునని అధికారులు వెల్లడించారు. విమాన ఇంధన తేరు, లయన్ ఎయిర్ లోగో ముక్కలు కూడా సముద్రం ఉపరితలానికి కొట్టుకొచ్చినట్టు వీడియో ఫుటేజ్‌ల వల్ల తెలుస్తోంది. కొన్ని మరమత్తుల కారణంగా ఈ జెట్ విమాన సర్వీసులను గతంలో నిలిపివేశామని, లోపాలను సరిదిద్దిన తర్వాతే సర్వీసులోకి తీసుకొచ్చామని లయన్ ఎయిర్ తెలిపింది. ఈ ఆకస్మిక ప్రమాదం ఓ మిస్టరీగా ఉందని ఫ్లయిట్ గ్లోబల్ ఆసియా మేనేజింగ్ ఎడిటర్ గ్రెగ్ వాల్ట్రన్ తెలిపారు. కాక్‌పిట్ వాయిస్ డేటా రికార్డు కోసం గాలిస్తున్నామని, అది లభిస్తే ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏమి జరిగి ఉంటుందన్న విషయాన్ని నిర్థారించగలుగుతామన్నారు. కాగా, ప్రమాద సమయానికి విమానంలో 178మంది పెద్దలు, ఓ చిన్నారి, మరో ఇద్దరు పసిపిల్లలు,ఇద్దరు పైలెట్లు, ఆరుగురు కేబిన్ సిబ్బంది ఉన్నట్టుగా రవాణా జాతీయ భద్రతా కమిటీ వివరించింది. ప్రయాణికుల్లో 20మంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇండోనేసియాలో పౌరయాన పరిశ్రమ ఇటీవల కాలంలో ఎంతో విస్తరించింది. ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు రావడంతో విమాన సర్వీసులకు డిమాండ్ పెరిగింది. 6.4బిలియన్ డాలర్ల వ్యయంతో మరో 50 ఈ తరహా విమానాలను కొనుగోలు చేసేందుకూ లయన్ ఎయిర్ సంస్థ సిద్ధమైన నేపథ్యంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంతగా డిమాండ్ పెరుగుతున్నా నియంత్రణ కొరవడిందన్న విమర్శలను ఇండోనేసియా ఎదుర్కొంటోంది. ఈ విమానాలు తమ గగన పరిధిలోకి రాకుండా అమెరికా, ఐరోపా దేశాలు నిషేధించాయి.

చిత్రాలు.. విమానం ప్రమాదం వివరాలు వెల్లడిస్తున్న ఎయర్‌పోర్ట్ అధికారులు
*ఇండోనేసియాలో సోమవారం ఉదయం కూలిపోయిన విమాన శకలాలకోసం గాలిస్తున్న సిబ్బంది.
* కూలిపోయిన విమానం