అంతర్జాతీయం

ఈదీ ఫౌండేషన్ అధిపతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూలై 9: పాకిస్తాన్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త, ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది శుక్రవారం రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న సత్తార్ ఈది కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేదలు, అనాథలకు పాతిక సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్నారు. భారతదేశానికి చెందిన మూగ చెవిటి బాలిక గీత పదకొండేళ్ల వయసులో పొరపాటున పాకిస్తాన్‌లో ప్రవేశించినప్పుడు ఈది ఆమెను కాపాడారు. తన ఫౌండేషన్‌లో ఉంచుకుని సంరక్షించి భద్రంగా భారత్‌కు అప్పగించారు. ఆమెను అప్పగించిన సందర్భంలో ఆయన ఫౌండేషన్‌కు భారత్ అందించిన విరాళాన్ని సున్నితంగా తిరస్కరించారు. జాతీయ స్టేడియంలో జరిగిన ఆయన అంతిమ ప్రార్థనలకు దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు హాజరయ్యారు. పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్, ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్‌లు సహా పలువురు సైనికాధికారులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఆయన మృతికి భారత
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంతాపం ప్రకటించారు.

చిత్రం..ఈది అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన జనం