అంతర్జాతీయం

నాదే మెజారిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, అక్టోబర్ 29: శ్రీలంక పార్లమెంట్‌లో ఇప్పటికీ తనకు మెజారిటీ ఉందని, ఇటీవల అధ్యక్షుడి చేతిలో తొలగింపునకు గురైన ప్రధాని రానిల్ విక్రమ్ సింఘే అన్నారు. ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయెన్స్ (యూపీఎఫ్‌ఏ) విక్రమ్‌సింఘే నేతృత్వంలోని యూఎన్‌పి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంలో మైనారిటీలో పడింది. శుక్రవారం అధ్యక్షుడు సిరిసేన విక్రమ్‌సింఘేని పదవి నుంచి తొలగించి, ఆయనకు భద్రతను, వాహనాలను ఉపసంహరించడమే కాక, ఆయన స్థానంలో రాజపక్సని నూతన ప్రధానిగా నియమించడమే కాక పార్లమెంట్‌లో నవంబర్ 16 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే మెజారిటీ నిరూపించుకోవడానికి పార్లమెంట్‌ను సమావేశపర్చాలని విక్రమ్‌సింఘే డిమాండ్ చేస్తున్నారు. సిరిసేన నిర్ణయాన్ని స్పీకర్ కూడా తప్పుబట్టారు. ఈ సందర్భంగా విక్రమ్‌సింఘే విదేశాలకు చెందిన విలేఖరులతో మాట్లాడుతూ తనకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని, పార్లమెంట్‌ను సమావేశపర్చే హక్కు స్పీకర్‌కు ఉందని, ఆయన రేపు దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తనకు సభ్యుల పూర్తిమద్దతు ఉందని, పార్లమెంట్‌ను సమావేశపర్చినప్పుడు ఈ విషయం రుజువవుతుందని అన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలలో ఇతరుల జోక్యం చెల్లదని స్పీకర్ జయసూర్య పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. కాగా, అధ్యక్షుడు, ప్రధాని మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా దేశంలో హింసాత్మక సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని పార్లమెంట్ స్పీకర్ జయసూర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పార్లమెంట్‌లో కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. దీనిని వీధుల్లో పరిష్కరించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఒకవేళ దానికి కనుక అనుమతినిస్తే దేశంలో రక్తపాతం చోటుచేసుకుంటుందని, ఇప్పటికే ఇద్దరు మృతి చెందారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.