అంతర్జాతీయం

అడ్డులేని అవకాశాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 29: భారత్‌లో అందుబాటులో ఉన్న వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని జపాన్ వ్యాపార, వాణిజ్య వేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ అన్ని విధాలుగా సానుకూల అవకాశాలను కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు, అవరోధాలు లేకుండా వ్యాపారాన్ని చేసుకునే గుణాత్మక పరిస్థితుల్ని కల్పించడానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇక్కడ సోమవారం జరిగిన భారత్-జపాన్ భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన మోదీ ‘సానుకూల వ్యాపారావకాశాల్లో భారత్ ఎంతో ముందుకు దూసుకుపోతోంది. నాలుగున్నరేళ్ల క్రితం నేను ప్రధానిగా ఉన్నప్పుడు ఈ విషయంలో 140 స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు వందో స్థానానికి చేరుకుంది’అని తెలిపారు.
శీతల పానీయం కంటే.. 1జీబీ డేటా చౌక
డిజిటల్ వౌలిక సదుపాయాల కల్పనలో భారత్ ఎంతో ప్రగతిని సాధించిందని స్పష్టం చేసిన మోదీ భారత్‌లో ఓ సీసా శీతల పానీయం కంటే 1జిబి డేటా ఎంతో చౌక అని అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశ వ్యాపార వేత్తలతో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు.

చిత్రం..టోక్యోలో సోమవారం ప్రవాస భారతీయుల సదస్సులో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ