అంతర్జాతీయం

గెలిస్తేనే గుర్తిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, నవంబర్ 5: పార్లమెంట్ విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తే ప్రధాని అవుతాడని, మహీంద్ర రాజపక్సే ఇక్కడ విశ్వాస పరీక్షలో విజయం సాధించే వరకు అతడిని ప్రధానిగా గుర్తించనని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ కరు జయసూర్య స్పష్టం చేశారు.
అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రజాస్వామ్య విరుద్ధంగా పార్లమెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేశారని, ప్రధాని రాణిల్ విక్రమ్‌సింఘేను పదవి నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. గతంలో తాను చేసిన వాగ్దానాన్ని తప్పి పార్లమెంట్‌ను తాను ప్రకటించిన తేదీ కన్నా వారం ఆలస్యంగా ఈ నెల 14న సమావేశపరుస్తానని అధ్యక్షుడు సిరిసేన ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్ సోమవారం ఒక ప్రకటన చేశారు. మెజారిటీ ఉన్నట్టు భావిస్తున్న పార్టీ తమ సభ్యుల పేర్లతో తనకు ఒక పిటిషన్‌ను దాఖలు చేయాలని ఆయన కోరారు. పార్టీ వారు తమ మెజారిటీని నిరూపించుకునే వరకు సభ్యుల కోరిక మేరకు స్టేటస్‌కోను పాటిస్తానని ఆయన చెప్పారు. దీని ప్రకారం రాజపక్సకు ప్రధానమంత్రి సీటును కేటాయించమని ఆయన తెలిపారు. దేశంలో ఏర్పడిన రాజకీయ సమస్యను పరిష్కరించడానికి త్వరగా పార్లమెంట్‌ను సమావేశపర్చాలని తాను అధ్యక్షుడిని కోరినట్టు స్పీకర్ చెప్పారు. ఇలావుండగా కొన్ని పౌర సంఘాలు స్పీకరే స్వతంత్రంగా వ్యవహరించి వెంటనే పార్లమెంట్‌ను సమావేశపర్చాలని కోరుతున్నా, దానిని ఆయన తిరస్కరిస్తూ అధ్యక్షుడి అనుమతి లేకుండా చేసే చర్యకు విలువ ఉండదని పేర్కొన్నారు. ఇలావుండగా ప్రధాని పదవి నుంచి తొలగింపునకు గురైన విక్రమ్‌సింఘే మాట్లాడుతూ ఈనెల 14న జరిగే సమావేశంతో సమస్య పరిష్కారం అవుతుందని భావించడం లేదని అన్నారు. నిర్ణయించిన ప్రకారం సభను సమావేశపర్చకుండా ఆలస్యం చేసి ఎంపీలతో బేరసారాలకు అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు. పార్టీ మారడానికి పెద్దయెత్తున డబ్బు చేతులు మారిందని ఆయన వర్గీయులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.