అంతర్జాతీయం

ఆంక్షల కమిటీ విధానాల్లో లోపించిన పారదర్శకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, నవంబర్ 11: ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ కార్యకలాపాలు పారదర్శకంగాలేవని, జవాబుదారీతనం లోపించిందని భారత్ ఘాటుగా విమర్శించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలపై వేటు వేయడంలో ఈ కమిటీ దాగుడు మూతల విధానాలను అవలంభిస్తోందని భారత్ పేర్కొంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైష్ మహ్మద్ సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్ కోరుతోంది. కాని చైనా అడ్డుపడుతోంది. ఇక్కడ ఈ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఐరాసలో భారత్ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ, ఇటువంటి సంస్థలు ప్రజల మనోభావాలను గౌరవించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, కాని జవాబుదారీతనం లేకుండా కమిటీ వ్యవహరిస్తోందన్నారు. ఐరాసలో వీటో అధికారం ఉన్న దేశాల వత్తిడికి లొంగడం మంచి పరిణామం కాదన్నారు. ఈ సందర్భంగా చైనా పేరును ఆయన ప్రస్తావించలేదు. ఆల్ ఖైదా తరహాలో ఆంక్షలు విధించాలన్న భారత్ ప్రతిపాదనకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు మద్దతు ఇస్తున్నా, చైనా మాత్రం మోకాలడ్డుతోంది. ఇప్పటికే జైషే మహ్మద్ సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ముద్రవేయాలన్న ప్రతిపాదన ఐరాస జాబితాలో ఉంది. ఆంక్షల కమిటీ కొత్త సంస్కరణలు, విధానాలను అవలంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్,బ్రెజిల్, జర్మనీ, జపాన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐరాస నడుచుకోవాలన్నారు. కొన్ని అంశాలు, భద్రత విషయంలో ఐరాస అనుసరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందన్నాలరు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య శాంతి, సహకారం అభివృద్ధి చెందాలంటే ఐక్యరాజ్యసమితి విధానాల్లో పారదర్శకత రావాలని ఆయన కోరారు.