అంతర్జాతీయం

అబుదాబిలో ‘గ్రాండ్’ మసీదును సందర్శించిన రవిశంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబుదాబి, నవంబర్ 19: యూఏఈలో అతిపెద్దదైన షేక్‌జయేద్ గ్రాండ్ మసీదును ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ సందర్శించారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఈ మసీదును సందర్శించిన రవిశంకర్ దాని అంశాన్ని చూసి పరవశులయ్యారు. ఈ సందర్భంగా మసీదు సెంటర్ డైరెక్టర్ జనరల్ యూసుఫ్ 1996-2007 మధ్య జరిగిన ఈ మసీదు నిర్మాణంలో భారతీయుల పాత్ర గురించి వివరించారు. మసీదులోని తెల్ల పాలరాతి పిల్లర్లు, మీదసులోని ఫ్లోరల్ పేటర్న్‌లు భారత్‌లోని తాజ్‌మహల్ స్ఫూర్తితో ఏర్పాటు చేశామని, వాటి నిర్మాణానికి ప్రతిభావంతులైన కళాకారులను భారత్ నుంచి రప్పించినట్టు చెప్పారు. సౌదీ అరేబియాలో మక్కా, మదీనా తర్వాత ఇదే అతిపెద్ద మసీదు అని తెలిపారు. ఈ మసీదులో ఏకకాలంలో 40 వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చునని, దీని నిర్మాణానికి అవసరమైన సామగ్రిని భారత్ సహా వివిధ దేశాల నుంచి తెప్పించామని చెప్పారు. 32.8 మీటర్ల వ్యాసార్థంతో 82 డోమ్‌లతో నిర్మించిన ఈ మసీదులో ముస్లింలు సహా అన్ని మతాల వారు ప్రార్థనలు చేసుకోవచ్చును. ‘ఇది చాలా అందమైన ప్రదేశం’ అని ఈ సందర్భంగా రవిశంకర్ విజిటర్స్ బుక్‌లో రాసారు.