అంతర్జాతీయం

హాజరైతే ఆయనకే మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 20: ముషారఫ్‌పై పాకిస్తాన్‌లో జరుగుతున్న విచారణకు స్వయంగా హాజరైతే ఆయనకే మంచిదని ఇస్లామాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణ సమయంలో ముషారఫ్‌కు సంబంధించిన పర్యటన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆయన న్యాయవాదిని ఆదేశించింది. రాజ్యాంగాన్ని 2007లో రద్దు చేశారన్న ఆరోపణపై విచారణను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 2016లో వైద్య చికిత్స నిమిత్తం దుబాయ్ వెళ్లి అప్పటి నుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉంటున్నారు. ఆయనపై నమోదైన కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనను పరారీలో ఉన్న వ్యక్తిగా కోర్టు ప్రకటించింది. విచారణలో భాగంగా సోమవారం జరిగిన వాదోపవాదనలో కేసు విచారణ నిమిత్తం ముషారఫ్‌ను పాకిస్తాన్‌ను రప్పించాలని బెంచ్ సూచించింది. ‘ఆయన ఇక్కడకు వచ్చి కేసు విచారణను ఎదుర్కొంటే ఆయనకే మంచిది’ అని బెంచ్ పేర్కొంది.
ఒకవేళ ఆయన కనుక పాకిస్తాన్ వస్తే ఆయనకు పూర్తి భద్రత కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముషారఫ్ తరఫున వాదిస్తున్న సల్మాన్ సఫదార్‌కు తెలియజేసింది. ముషారఫ్ జరిపిన పర్యటనలకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ నిమిత్తం కేసును డిసెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది.