అంతర్జాతీయం

ఐరాస పర్యావరణ చీఫ్ సోల్హీమ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, నవంబర్ 21: అవసరాలకు మించి ఇష్టం వచ్చినట్లు ప్రయాణాలు చేసి ఎడాపెడా డబ్బు ఖర్చుపెట్టిన ఐరాస పర్యావరణ విభాగం చీప్ ఎరిక్ సోల్హీమ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన దాదాపు 488000 డాలర్లను ప్రయాణాలపై ఖర్చుపెట్టినట్లు ఆడిట్ నివేదికలో బహిర్గతమైంది. ఆయన రాజీనామాను ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరెస్ ఆమోదించారు. సోల్హీమ్ ఐరాసన పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ వివరాలను అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు. కాగా పర్యావరణ రంగం అభివృద్ధికి, కాలుష్య నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకున్న సోల్హీమ్ విశేష సేవలు అందించారని ఐరాస సెక్రటరీ జనరల్ గెటెరెస్ పేర్కొన్నారు. పర్యావరణ పరంగా ప్రపంచ దేశాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షకుల హక్కులు, పర్యావరణ భద్రత అంశాలపై సోల్హీమ్ విశేషమైన కృషి చేశారన్నారు. సోల్హీమ్ స్థానంలో టాంజానియాకు చెందిన యుఎన్‌ఈపీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాయిస్ సూయను నియమించనున్నారు. ప్రయాణాలకు ఇష్టం వచ్చినట్లు సొమ్మును ఖర్చుపెట్టిన సోల్హీమ్ జవాబుదారీతనం లేకుండా వ్యవహరించారని న్యూయార్కు టైమ్స్‌లో కథనం వెలువడింది. ఐరాసలోని తన కార్యాలయంలో ఉండకుండా మొత్తం పదవీ కాలంలో 79 శాతం ప్రయాణాల్లో ఉన్నారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏజన్సీ ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది. 22 నెలల్లో 488519 డాలర్లను ఖర్చుపెట్టారు. 668 రోజుల్లో 529రోజులు ప్రయాణాలు చేశారు.