అంతర్జాతీయం

‘ప్రత్యేక’ ప్రశ్నలకు ట్రంప్ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 21: అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై వచ్చిన అభియోగాలకు సంబంధించి ప్రత్యేక న్యాయవాది రాబల్ట్ ముల్లర్ చేసిన అభియోగాలకు బదులిచ్చినట్లు అధ్యక్షుడు ట్రంప్ న్యాయవాదులు ప్రకటించారు. ప్రత్యేక న్యాయవాది కార్యాలయం నుంచి వచ్చిన ప్రశ్నలతో కూడిన పత్రాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియచేశామని, వాటికి ట్రంప్ బదులిచ్చారని ఆయన తెలిపారు. ఈ విచారణలో రష్యా జోక్యానికి సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి. అధ్యక్షుడు రాతపూర్వకంగా బదులు ఇచ్చినట్లు వైట్ హౌస్ న్యాయవాది జే సెకులావ్ చెప్పారు. ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గిలియానీ కూడా ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ప్రశ్నలన్నీ రాజ్యాంగపరమైనవని, న్యాయవిచారణకు అతీతమైనవని వారు పేర్కొన్నారరు. అధ్యక్షుడు ట్రంప్ ప్రతి ప్రశ్నకు చక్కగా స్పందిస్తూ కూలంకషంగా వివరణ ఇచ్చారన్నారు. ప్రత్యేక న్యాయవాది 30 సాక్ష్యాలతో, 1.4 మిలియన్ పేజీలతో కూడిన నివేదిక తయారు చేశారు. ఇక విచారణ ముగించే దశ ఆసన్నమైందని వ్యక్తిగత న్యాయవాది గిలియానీ చెప్పారు. కాగా ట్రంప్ ఈ ప్రశ్నలు సులభమైనవని, స్పందించే సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తలేదని తెలిపారు. దురుద్దేశ్యంతో కొంత మంది ఉంటారు. అందుకే ప్రతి ప్రశ్నకు చక్కగా బదులిచ్చాను, ఇటువంటి ప్రశ్నలకు బదులిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ పేర్కొనడం విశేషం.

చిత్రం‘్థంక్స్ గివింగ్’ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో
తన భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి సంప్రదాయబద్ధంగా బఠాణీలు పంచుతున్న
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నేషనల్ టర్కీ ఫెడరేషన్ చైర్మన్ జెఫ్ స్టీన్ కూడా చిత్రంలో ఉన్నారు