అంతర్జాతీయం

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, నవంబర్ 21: ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 55 మంది మృతి చెందారు. మరో 94 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మిలాదున్ నబీ సందర్భంగా యురేనస్ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మాహుతి సభ్యుడు తనను తాను పేల్చేసుకుని విస్ఫోటనం సృష్టించాడు. కాబూల్‌లో మతపరమైన సమావేశాల్లో జరిగిన దాడుల్లో ఈ ఏడాదిలోనే ఇది అత్యంత దారుణమైనది. మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు కోసం జరిగిన ఈ వేడుకలో వందలాది మంది పాల్గొన్నారు. ఖురాన్ పఠనం సమయంలోనే ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. టర్బన్లు, చెప్పులు, కుర్చీలు, విరిగిన అద్దాలు ఎక్కడికక్కడ విసిరేసి ఉన్నాయి. ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ ఘటన మారణహోమాన్ని తలపించేదిగా ఉంది. ‘ఈ మానవబాంబు దాడి నా కళ్లెదుట జరిగింది. క్షణాల్లో ప్రాణాలను గాలిలో కలిసిపోయాయి. నా పక్కనే శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి’ అని ప్రత్యక్ష సాక్షి ఫరీద్ ఆవేదనతో చెప్పాడు. దాడిలో తన స్నేహితుడు, అతడి చిన్న కొడుకు ప్రాణాలు కోల్పోయారని కన్నీళ్లపర్యంతమయ్యాడు. అనేక మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు తెలిపారు. పండుగ నాడు జరిగిన ఈ దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అత్యంత దుర్మార్గ చర్య అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఆఫ్గానిస్తాన్‌లోని యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందం ‘ఇది మన అందరిపై జరిగిన దాడి’ అని పేర్కొంది. ఆత్మాహుతి దాడి ఆటవిక చర్యగా దేశాధ్యక్షుడు అషఫ్ ఘనీ పేర్కొన్నారు. ‘తాలిబన్ ఉగ్రవాదులు దాడిని ఖండించాల్సింది పోయి, తమకు సంబంధం లేదని చెప్పడం దారుణం’అని ఆయనో సందేశంలో అన్నారు. ఈ అమానుష దాడిని దేశం యావత్తూ ఖండించింది. ముస్లిం ఛాందసవాదుల దుర్మార్గాలకు అమాయకులు బలైపోతున్నారని మంత్రి సలహాదారు మెహ్రాబ్ డానిష్ చెప్పారు. ఆత్మాహుతి దాడిలో 55 మంది మరణించగా, మరో 94 మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాహిద్ మజ్రోహ్ వెల్లడించారు. గాయపడ్డవారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆత్మాహుతి దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని కాబూల్ పోలీస్ చీఫ్ బాసిర్ ముజాహిద్ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పోలీసుల రక్షణ కావాలిన ఎవరూ కోరలేదని ఆయన పేర్కొన్నారు.

చిత్రం.. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగి రక్తసిక్తమైన ఫంక్షన్ హాల్