అంతర్జాతీయం

ఆస్ట్రేలియాతో ఐదు ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, నవంబర్ 22: భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలని, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కార్ మారిసన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరుదేశాలు ఐదు అంశాలపై అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. భారత రాష్టప్రతి కోవింద్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం ఇక్కడకు చేరుకున్నప్పుడు ఘనస్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాధినేతలు గురువారం ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ వవిరాలను విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి మారిసే పైనీ, ఉభయ దేశాల హైకమిషనర్ల సమక్షంలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. వికలాంగుల సంక్షేమం, వారికి నాణ్యమైన సేవలు అందించడం, పెట్టుబడులు, రాంచిలో మైనింగ్ ప్లానింగ్, డిజైన్ ఇనిస్టిట్యూట్ నెలకొల్పడం, కేన్‌బెర్రాలో కామన్‌వెల్త్ సైంటిఫిక్ రీసెర్చి ఆర్గనైజేషన్ ఏర్పాటు, గుంటూరులోని ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్శిటీ మధ్య వ్యవసాయం పరిశోధన, వ్యవసాయ విద్య రంగాలపై టెక్నాలజీ మార్పడి, న్యూఢిల్లీలో ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రిస్బేన్‌లో జాయింట్ పీహెచ్‌డి పరిశోధన ఒప్పందంపై ఎంఓ యూ ఖరారైంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మారిసన్ భారత్ ఆర్థిక పత్రాన్ని విడుదల చేశారు. భారత్‌లో రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం వాణిజ్య రంగంలో పెట్టుబడులు తీరుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. ఈ రోడ్ మ్యాప్‌లో ప్రకటించిన ప్రణాళిక మేరకు ఆస్ట్రేలియా పెట్టుబడులను పెడుతుందని, పరస్పరసహకారంతో రెండు దేశాలు ముందడుగు వేస్తాయని ప్రధాని మారిసన్ అన్నారు.
మెల్‌బోర్న్‌లో మహాత్ముని కాంస్య విగ్రహం
ఆస్ట్రేలియాలోని సిడ్నీనగరంలో మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆవిష్కరించారు. రోజురోజుకు హింస పెరిగిపోతున్న నేటి సమాజానికి నాడు మహాత్ముడు ఇచ్చిన అహింస, శాంతి సందేశాలు ఎంతో అవసరమని అన్నారు.
చిత్రం..మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న భారత రాష్ట్రపతి దంపతులు