అంతర్జాతీయం

జగిత్యాల మామిడికి అంతర్జాతీయ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఏప్రిల్ 7: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా జగిత్యాల మామిడి మార్కెట్ ఖ్యాతి గడించింది. డివిజన్ కేంద్రమైన జగిత్యాల మార్కెట్‌లో మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రతి యేటా రూ.100కోట్ల టర్నోవర్ ఇక్కడ మామిడి మార్కెట్లో జరుగుతుంది. జగిత్యాల మార్కెట్ నుండే జమ్ముకాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఎర్సిన్, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు. ఉత్తర తెలంగాణలోనే జగిత్యాల మ్యాంగో మార్కెట్ అతి పెద్దది. హైదరాబాద్, ముంబాయి తదితర నగరాలకు ఈప్రాంత మామిడిని తరలిస్తారు. వేసవి ఆరంభం నుండి జోరందుకునే మామిడి అమ్మకాలు జూన్ చివరి వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్‌లో కిలో బంగినపల్లి ధర రూ. 45, దసేరా రూ. 50వరకు పలుకుతోంది.
హైబ్రీడ్ రకం మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మామిడి దిగుమతి పెద్దగా ఆశా జనకంగా లేకపోయినప్పటికీ వీటి ధరలు మాత్రం నిలకడగా ఉండడం లేదు. వేసవి తీవ్రతను బట్టి వ్యాపారులు విక్రయిస్తున్నారు. మార్కెట్లో ఎక్కువగా బంగినపల్లి మామిడిపండ్లకు డిమాండ్ ఉన్న చెరుపు, చెందర, చిన్న, పెద్ద రసాలు, హిమాయితీ, దిల్‌పసంద్, దసేరా, మున్న, కల్పన, లండ, పంచదారకలాంను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హైబ్రీడ్ రకం మామిడి పండ్లు ఒక్కో మామిడి 1, 2కిలోల బరువు ఉండి పండ్ల ప్రియులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ పండ్లను ఎక్కువగా రసాల తయారీ సెంటర్లు కొనుగోలు చేస్తాయి. మామిడిలో అనేక రకాలుండగా బంగిన్‌పల్లి, కోతాపరి,మల్‌గోబా, హిమాయుద్దీన్, నీల,లంగాడ, దసేరి,కేసర్, కలాం, పొదిరి, కొబ్బరి ఇవి కోతకు చెందినవి, చిన్న, పెద్దరసాలు చెరుకు రసం, నవనీతం, పోనకాలు, పంచదార, కలసపండ్ల రసానికి చెందినవి, నూజివీడు మామిడి, బొబ్బిలి, అఫలం, అఫాఫా, పాలకాయ పండ్ల రకానికి చెందినవి. ఈ పండ్ల గుజ్జుతో జాములు, ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తారు. పిందె దశ నుండి పరిపక్వ దశ వరకు అన్ని దశలలోనూ ఉపయోగించుకోవచ్చు పక్వానికి రాని పచ్చికాయల నిత్యం పప్పుకూరల్లో, పులుసుల్లోనే కాక ఊరగాయ పచ్చళ్లలో కూడా ఉపయోగిస్తారు.