అంతర్జాతీయం

రక్షణలో తిరుగులేని సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ రంగంలో బలమైన సహకారం కొనసాగుతుందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె అమెరికాలో ఇండో పసిఫిక్ కమాండ్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య రక్షణ రంగం, ప్రాంతీయ భద్రత విభాగాల్లో పరస్పర సహకారం ఉందన్నారు. వ్యూహాత్మంగా ఇరు దేశాలు భద్రత విషయంలో అడుగులు వేస్తున్నాయన్నారు. గత పదేళ్లుగా ఈ బంధం కొనసాగుతోందన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో తిరుగులేని విశ్వసనీయత ఉందన్నారు. హవాలీలో ఉన్న పసిఫిక్ కమాండ్ విభాగాన్ని సందర్శించడంపై స్పందిస్తూ భారత్, అమెరికా మధ్య మైత్రి దృఢమైందన్నారు. రెండు దేశాలు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలను కలిగి ఉన్నాయని, శతాబ్ధాల తరబడి ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయన్నారు. ఇండోపసిఫిక్ క్షేత్రంలో ఇరుదేశాలు పరస్పర సహకారంతో, టెక్నాలజీని పంచుకుని రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు. ఇరుదేశాలు రక్షణ రంగంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పశ్చిమబెంగాల్‌లోని కలైకుండ, పనగడ్‌లో ఇరుదేశాలు మిలిటరీ విన్యాసాలు చ్తే=చేస్తున్నాయన్నారు. ఇరుదేశాలు వైమానిక దళ విన్యాసాలను కూడా త్వరలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకు ముందు పెంటాగాన్‌లో కేంద్రమంత్రి సీతారామన్ మాట్లాడుతూ రక్షణ రంగంలో ఇరుదేశాలు ప్రస్తుతం ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా పయనించనున్నట్లు చెప్పారు. గత నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ మెన్స్‌ను, జీ20 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో ఏబేని కలుసుకున్నారు. అమెరికా పర్యటనలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఘనస్వాగతం లభంచింది. ఈ దేశాన్ని సందర్శించిన తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి సీతారామన్ కావడం విశేషం. అమెరికా సైనిక వ్యవస్థ వ్యూహాత్మకంగా బలంగా ఉండేందుకు కారణాలను ఆమె సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. అమెరికా రక్షణ పరిశోధన రంగంలోని వ్యవస్థలను ఆమెశాన్‌ఫ్రాన్సిస్కోలో సందర్శించారు. ఈ పర్యటనలో ఆమె ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక వ్యవస్థను పటిష్టం చేయడంపై తీసుకోవాల్సిన చర్యలను అమెరికా సైనిక ఉన్నతాధికారులతో చర్చింతచారు. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై భారత్ కోణం నుంచి అభిప్రాయాలను అక్కడి రక్షణ నిపుణులతో పంచుకున్నారు.

చిత్రం.. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్