అంతర్జాతీయం

లెట్టస్‌తో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 8: విరివిగా దొరికే క్యాబేజీని పోలిన లెట్టస్‌ను వాడవద్దని అమెరికా, కెనడా ప్రజలకు ఆరోగ్య విభాగం అధికారులు సూచిస్తున్నారు. కెనడాలోని అంటారియో, క్యూబెక్ ప్రావీన్స్‌తోపాటు అమెరికాలోని 11 రాష్ట్రాల్లో లెట్టస్ కారణంగా చాలా మంది విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారని హెచ్చరించారు. కాగా, అమెరికాలో 32 మంది, కెనడాలో 18 మంది మృతికి ఒకే రకమైన వ్యాధి కారణమని వైద్య నిపుణులు గుర్తించారు. లెట్టస్‌ను ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల ఒంటి మీద దద్దుర్లు ఏర్పడుతున్నాయని, ఆతర్వాత అవి మరింతగా ముదిరి ప్రాణాలను హరిస్తున్నాయని తేల్చారు. దీనితో లెట్టస్ వాడకంపై అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లెట్టస్‌ను వాడవద్దని సూచించారు. వారు చేసిన హెచ్చరికలతో కెనడా ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇదే తరహా ప్రకటనతో ప్రజలను చైతన్యపరిచారు. లెట్టస్‌ను అమెరికా, కెనడా ప్రాంతాల్లో విరివిగా వాడడం వల్ల, అక్కడ అంతుచిక్కని వ్యాధి ప్రబలుతున్నదని వివరించారు. ప్రాణాలను హరిస్తున్న ఆ వ్యాధి లక్షణాలను పరిశోధించి, ప్రత్యామ్నాయాలను పేర్కొనే వరకూ లెట్టస్‌ను వాడకపోవడమే మంచిదని స్పష్టం చేశారు.