అంతర్జాతీయం

11 నుంచి భారత్, చైనా సైనిక విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, డిసెంబర్ 9: ఈ నెల 11వ తేదీన భారత్, చైనా దేశాలు ఉమ్మడిగా మిలిటరీ విన్యాసాలను చైనాలోని చెంగ్డూ నగరంలో నిర్వహించనున్నాయ. ఈ విన్యాసాలు ఈ నెల 23వ తేదీ వరకు జరుగుతాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇది నిదర్శనమని చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి కల్నల్ రెన్ గోకీయాంగ్ చెప్పారు. ఉగ్రవాదం నిర్మూలన, ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపుదలకు ఈ విన్యాసాలు ఉపకరిస్తాయన్నారు. ఇరుదేశాలు తమ వైపు నుంచి వంద ట్రూపుల చొప్పున సైన్యాన్ని ఈ విన్యాసాలకు పంపుతుంది. ఈ విన్యాసాలను హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే చేయి చేయి కలుపు లక్ష్యంతో ప్రారంభిస్తారు. ఒక ఏడాది విరామం తర్వాత ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. డొక్లాం సరిహద్దు వద్ద గత ఏడాది ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం విదితమే. ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు ఇటీవల కాలంలో మెరుగుపడ్డాయి. ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌లు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సమావేశమై సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదం నిర్మూలనకు ఎత్తుగడలు, వ్యూహాలు అవసరమని, దీని కోసం రెండు దేశాల సైన్యం తమ శక్తి సామర్థ్యాలను ఈ విన్యాసాల్లో చాటుతాయని కల్నల్ రెన్ చెప్పారు. గత నెల 13వ తేదీన మన రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా, చైనా లెఫ్టినెంట్ జనరల్ షా యామింగ్ మధ్య 9వ రక్షణ రంగ చర్చలు జరిగిన విషయం విదితమే.