అంతర్జాతీయం

రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, డిసెంబర్ 13: శ్రీలంక పార్లమెంటును రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ విషయంలో దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చర్యను కోర్టు తప్పుబట్టింది. పార్లమెంటు కాలపరిమితి నాలుగున్నర సంవత్సరాలని, ఇది పూర్తయ్యేవరకు పార్లమెంటును రద్దు చేసే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు పేర్కొంది. గురువారం సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు లోపల, వెలుపల పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్టోబర్ 26వ తేదీన ప్రధానమంత్రి రాణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడు తొలగించారు. దీంతో దేశంలో రాజ్యాంగ సంక్షోభం చోటు చేసుకుంది. విక్రమసింఘే స్థానంలో మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేను నియమించారు. అనంతరం 225 సభ్యులున్న పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేశారు. అనంతరం జనవరి 5వ తేదీన ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. కాగా పార్లమెంటులో బలపరీక్షలో ప్రధాని రాజపక్సే నెగ్గలేకపోయారు. ప్రధానిగా కొనసాగాలంటే 113 మంది సభ్యుల మద్దతు అవసరం. కాగా విక్రమసింఘే బలపరీక్షలో విజయం సాధించారు. ఆయనకు అనుకూలంగా 117 ఓట్లు వచ్చాయి. పార్లమెంటులో ఇంతవరకు బలపరీక్షను నిరూపించుకోవడంలో రాజపక్సేవిఫలమయ్యారు. కాగా సుప్రీంకోర్టు గత నెల 13వ తేదీన అధ్యక్షుడు పార్లమెంటు రద్దుపై ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను చెల్లదని, విరుద్ధమని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కాగా పార్లమెంటు మూడింట రెండు వంతుల మెజార్టీతో పార్లమెంటును రద్దు చేసే అధికారం కలిగి ఉంది. ఇప్పటికీ ప్రధాని విక్రమసింఘే అధికార నివాసంలోనే ఉన్నారు. తన ప్రభుత్వాన్ని అధ్యక్షుడు రద్దు చేయడం విరుద్ధమని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని 19వ సవరణలోని నిబంధన కింద అధ్యక్షుడికి పార్లమెంటును రద్దు చేసే అధికారంలేదన్నారు. విక్రమసింఘేతో ఉన్న విబేధాలు, రాజ్యాంగ పరమైన సమస్యల వల్ల తాను ఆయనను మళ్లీ ప్రధాని పదవిలోనియమించలేమని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువంటి మలుపు తిరుగుతాయన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.