అంతర్జాతీయం

పారిస్ ఒప్పందంపై రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటోవైస్ (పోలాండ్), డిసెంబర్ 13: పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి ఖరారైన పారిస్ ఒప్పందం విషయంలో రాజీలేదని, వీటిపై తదుపరి సంప్రదింపులు ఉండబోవని భారత్ స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న సమతౌల్యం దశను యదావిధిగా కొనసాగించాలని భారత్ పేర్కొంది. సమానత్వం, ఉమ్మడి బాధ్యత అనేవి కొనసాగాలని భారత్ పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి ఏకే మెహతా పేర్కొన్నారు. కాని నిర్దేశించిన విధుల మేరకు అన్ని దేశాలు ఎవరి పరిధిలో వారు మార్గదర్శకాలకు లోబడి పనిచేయాలన్నారు. వాతావరణంలో, పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అణగారిన వర్గాలు, పేదలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. 2020 నాటికి పారిస్ ఒప్పందానికి లోబడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. అతి త్వరలో దోహా సదస్సులో చేసిన అంశాలపై సవరణలు రాబోతున్నాయన్నారు. పారిస్ ఒప్పందంలో ఖరారు చేసిన అంశాలపై అమెరికా, ఐరోపా యూనియన్లు సవరణలను ప్రతిపాదించాయి. కాగా భారత్‌తో పాటు పలు దేశాలు సవరణల ప్రతిపాదనలను వ్యతిరేకించాయి. ఐపీసీసీ తాజాగా విడుదల చేసిన నివేదికలోని అంశాలను భారత్ స్వాగతించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పనిచేయాలని, అప్పుడే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలమని ఈ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పులపై ఇచ్చిన శాస్ర్తియ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని భారత్ కోరింది.