అంతర్జాతీయం

రెండ్రోజుల్లో తేల్చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, డిసెంబర్ 14: శ్రీలంక ప్రధాని ఎవరో సోమవారం తేల్చాస్తానని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. అయితే రనీల్ విక్రమసింఘేను తిరిగి నియమించే సమస్యేలేదని శుక్రవారం ఆయన తేల్చిచెప్పారు. విక్రమసింఘే తప్పించి రాజపక్సేను నియమిస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ సంక్షోభం సృష్టించింది. సిరిసేన అంతటితో ఆగకుండా పార్లమెంట్‌ను సస్పెండ్ చేశారు. అధ్యక్షుడి నిర్ణయాన్ని శ్రీలంక సుప్రీం కోర్టు గురువారం ఆక్షేపించింది. పార్లమెంట్ సస్పెండ్ చేసే అధికారం అధ్యక్షుడికి లేదని ధర్మాసనం ప్రకటించింది. సిరిసేన నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమైందని విమర్శించింది. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంట నే అధ్యక్షుడి సచివాలయం అత్యవసర సమావేశమైంది. అధ్యక్షుడు సిరిసేన అధ్యక్షతనే ఈ కీలక సమావేశం జరిగింది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఆయన స్పష్టం చేశారు. అయి తే ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రమసింఘేకు అవకాశం కల్పించబోనని సిరిసేన అన్నట్టు ‘కొలంబో పేజ్’ వెల్లడించింది. విక్రమసింఘే నాయకత్వంలోని యునైటెడ్ నేషనల్‌పార్టీ(యూఎన్‌పీ) దే శాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోందని, దా న్ని తాను అడ్డుకుంటానని అధ్యక్షుడు ప్రకటించారు. అక్టోబర్ 26న ప్రధాని రనీల్ విక్రమసింక్షేను పదవి నుంచి తప్పించి రాజపక్సేను సిరిసేన నియమించారు. అధ్యక్షుడి చర్య దేశంలో పెను దుమారాన్ని రేపింది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. ఏకంగా పార్లమెంట్‌నే రద్దుచేశారు. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా అధ్యక్షుడికి చుక్కెదురైంది. రాజపక్సే, ఆయన కేబినెట్‌కు ఎ లాంటి అధికారాలూ చెలాయించడానికి వీల్లేదని కోర్టు తీర్పునిచ్చింది. తరువాత పార్లమెంట్ బలపరీక్షలో విక్రమసింఘే నెగ్గారు. రాజపక్సే మెజారిటీ నిరూపించుకోలేకపోయారు. అధ్యక్షుడు సిరిసేన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో 13 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన మంత్రిని తప్పించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. సిరిసేన చర్య రాజ్యాంగ విరుద్ధమని బెంచ్ స్పష్టం చేశారు.