అంతర్జాతీయం

విశ్వసనీయ దర్యాప్తు సంస్థతో ఖషోగ్గి హత్యకేసు దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహ, డిసెంబర్ 16: ఇస్తాంబుల్‌లోని అరేబియా కాన్సులేట్‌లో పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గి హత్య కేసును విశ్వసనీయమైన సంస్థతో దర్యాప్తు చేయించాలని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గ్యుటెరస్ కోరారు. ఈ సంఘటనతో ప్రమేయమున్న వారిని పట్టుకుని శిక్షించాలంటే కచ్చితంగా ఒక విశ్వసనీయమైన సంస్థతో దర్యాప్తు చేయించాలని ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి మీడియాలో వచ్చిన సమాచారమే తప్ప పూర్తి వివరాలు తనకు తెలియదని ఆయన చెప్పారు. అయితే ఈ హత్య కేసును దర్యాప్తు చేయాలని తనకు విజ్ఞాపనలు వచ్చాయని ఆయన తెలిపారు.
వాషింగ్టన్ పోస్టు పత్రికకు సౌదీ విలేఖరిగా పనిచేస్తున్న ఖషోగ్గి ఈ ఏడాది అక్టోబర్ రెండున సౌదీ రాజుకు చెందిన ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్‌కు వెళ్లిన కొద్దిసేపటికే హత్యకు గురయ్యాడు. రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై విమర్శలు చేసినందునే ఖషోగ్గిపై బహిష్కరణ వేటు వేశారని, ఈ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగిందని టర్కీ చేస్తున్న ఆరోపణలను సౌది అరేబియా ప్రభుత్వం పదేపదే ఖండిస్తూ వస్తోంది. ఈ హత్యకు సంబంధించిన నిజానిజాలు వెలికివచ్చే వరకు తమ ప్రభుత్వం వదిలిపెట్టదని టర్కీ విదేశాంగ మంత్రి తెలిపారు. హత్యకేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలు కొత్తగా ఏమీ తమకు సౌదీ నుంచి అందలేదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ అంశాలు ముడిపడి ఉన్నందున ఈ హత్యకేసుకు సంబంధించి జోక్యం చేసుకోవాలని తాము ఐక్యరాజ్య సమితిని కోరినట్టు ఆయన చెప్పారు. దీనిపై యూఎన్‌తో చర్చలు జరుపుతున్నామన్నారు. కాగా, ఖషోగ్గిని హత్య చేయడానికి 15 సభ్యుల సౌదీ బృందాన్ని ఇస్తాంబుల్‌కు పంపారని, వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని టర్కీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.