అంతర్జాతీయం

సమసిన సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో: శ్రీలంక ప్రధానిగా మళ్లీ రాణిల్ విక్రమసింఘేను దేశాధ్యక్షుడు నియమించారు. దీంతో శ్రీలంకలో 51 రోజుల క్రితం తలెత్తిన రాజ్యాంగ సంక్షోభానికి తెరపడింది. ప్రధాని విక్రమసింఘేను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తొలగించిన విషయం విదితమే. ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు రాజపక్సేను నియమించారు. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో 69 ఏళ్ల విక్రమసింఘే చేత దేశాధ్యక్షుడు మైత్రిపాలన సిరిసేన ప్రమాణస్వీకారం చేయించారు. అక్టోబర్ 26వ తేదీన విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి అధ్యక్షుడు తొలగించారు. ప్రధానిగా నియమితులైన రాజపక్సే శనివారం పదవికి రాజీనామ చేయడంతో ప్రతిష్టంభన తొలగింది. సుప్రీంకోర్టు కూడా పార్లమెంటు రద్దు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇవ్వడం గమనార్హం. శ్రీలంకలో ప్రజాస్వామ్యం గెలిచింది. గత 50 రోజులుగా దేశంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రపంచ దేశాలు చూశాయి. ఇది శ్రీలంకలో సామాన్యుడి విజయం. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు పాటుపడింది. చివరకు న్యాయం గెలిచింది. అధికారాన్ని దొడ్డిదారి ద్వారా చేజిక్కించుకోవాలన్న మార్గాలు మూసుకుపోయాయి. పార్లమెంటు రద్దు అన్యాయం, సుప్రీంకోర్టు జోక్యంతో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టింది అని ప్రధాని విక్రమసింఘే అన్నారు. విక్రమసింఘే ప్రధానిగా నియమితులు కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. త్వరలో మంత్రివర్గం విస్తరణ చేపట్టనున్నట్లు ప్రధాని చెప్పారు. ఇందులో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి కూడా అవకాశం ఇస్తామన్నారు. దేశాధ్యక్షుడు సిరిసేనతో కలిసి తాము పనిచేస్తామని, వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థ ప్రధానమని ఆయన అన్నారు. దేశాధ్యక్షుడిని కొంత మంది తప్పుదోవబట్టించారని యూఎన్‌పీ నేత, ప్రధాని సహచరుడు ప్రేమదాస అన్నారు. శ్రీలంకలో సత్యం గెలిచింది. ఇంతకంటే ఆనందం ఏముంటుంది. దేశం ప్రమాదపరిస్థితుల్లో చిక్కుకోకుండా సుప్రీంకోర్టు రక్షించింది అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చిత్రం..శ్రీలంక ప్రధానిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదివారం పార్లమెంట్ సభ్యులు,
మద్దతుదారుల సమక్షంలో మాట్లాడుతున్న రాణిల్ విక్రమ్‌సింఘె