అంతర్జాతీయం

ఆస్కార్‌కు ‘పిరియడ్ ఆఫ్ సెంటనెన్స్’ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజెల్స్, డిసెంబర్ 18: మహిళలు ప్రతినెలా ఎదుర్కొనే బహిష్టు సమస్యను ప్రధానంగా తీసుకుని భారత గ్రామీణ నేపథ్యంలో తీసిన ‘పిరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే భారత్ చిత్రం షార్టు సబ్జెక్టు కేటగిరి కింద 91వ అస్కార్ అవార్డుల పోటీకి ఎంపిక చేశారు. అవార్డు గ్రహీత రేకజెహతబ్‌చి దర్శకత్వం వహించిన ఈ షార్ట్ఫులింను గునీత్ మోంగాకు చెందిన సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సందర్భంగా మోంగా మాట్లాడుతూ పోటీకి తమ చిత్రం ఎంపిక కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, ఇది కనీసం టాప్ ఐదు లిస్టులో నిలవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ వార్త విన్న వెంటనే తాను ఎంతో ఉద్వేగం, గర్వం పొందానని ఆమె అన్నారు. అవార్డు వచ్చినా రాకున్నా అంతర్జాతీయంగా వచ్చిన తనకీ గుర్తింపు చాలని ఆమె ఆనందంతో అన్నారు. శానిటరీ ప్యాడ్‌ల ఆవశ్యకత గురించి ప్రధానంగా తెలియజేసే ఈ షార్టు ఫిలింను లాస్‌ఏంజెల్స్‌లోని ఓక్‌ఉడ్ స్కూల్ విద్యార్థులు, వారి టీచర్ బెలిసా బెర్టన్ ప్రారంభించారు. ఢిల్లీ శివారులోని హాపూర్ గ్రామం నేపథ్యంగా కథ నడుస్తుంది. శానిటరీ ప్యాడ్‌లు అందుబాటులో లేని కాలంలో బహిష్టు సమయంలో మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యలు, వారు ఎదుర్కొనే ఆంక్షలు చూపించారు. తర్వాత శానిటరీ ప్యాడ్‌లు అమ్మే మిషన్‌ను గ్రామంలో ఏర్పాటు చేయడం, తర్వాత తమపై ఉన్న ఆంక్షల నుంచి మహిళలు బయటకు రావడం, వారే సొంతంగా ప్యాడ్‌లను తయారు చేసే శక్తిని సంతరించుకోవడమే కాక, ‘ఫ్లై’ పేరుతో వాటిని అమ్మి సాధికారిత సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచే కథాంశంతో చిత్రం సాగుతుంది. కాగా, అస్కార్‌కు ఎన్నకైన మిగిలిన చిత్రాల్లో బ్లాక్ షీప్, ఎండ్ గేమ్, లైఫ్‌బోట్, లాస్ కమాండోస్, మై డెడ్ డాడ్స్ పోర్నో టేప్స్, ఏ నైట్ ఎటిది గార్డెన్, 63 బాయ్‌కాట్, ఉమెన్ ఆఫ్ ది గులాగ్, జియాన్ ఉన్నాయి.
విలేజ్ రాక్‌స్టార్స్ అవుట్
ఆస్కార్ విదేశీ ఉత్తమ చిత్రాల కేటగిరిలో భారత అధికారిక ఎంట్రీగా నామినేట్ అయిన విలేజ్ రాక్‌స్టార్స్ పోటీ నుంచి తప్పుకుంది. ఈ కేటగిరిలో నామినేట్ అయిన 87 చిత్రాల్లో తదుపరి రౌండ్‌కు కేవలం తొమ్మిది చిత్రాలు మాత్రమే అర్హతను సంతరించుకున్నాయి. ఆస్కార్ అవార్డు పొందాలన్న తమ కల ప్రస్తుతం నెరవేరనప్పటికీ ఇప్పటివరకు సాధించిన అర్హతలు తనకెంతో సంతృప్తిని ఇస్తున్నాయని చిత్ర దర్శకురాలు రిమాదాస్ అన్నారు. ఆస్కార్ ఉత్తమ చిత్రాల కేటగిరిలో ఇప్పటివరకు భారత్ దేశం ఎలాంటి విజయాలను సాధించలేదు. 2001లో అశుతోష్ గౌరీకర్ తీసిన లగాన్ చిత్రం తుది ఐదు చిత్రాల ఫైనల్స్‌కు చేరుకుంది. 1958లో మదరిండియా, 89లో సలాం బాంబే చిత్రాలు కూడా టాప్ 5లో స్థానం పొందాయి.