అంతర్జాతీయం

ఖాట్మండులో మోనోరైలు ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, డిసెంబర్ 19: నేపాల్ రాజధాని ఖాట్మండులో 27 కిలోమీడర్ల మేర మోనోరైలు నిర్మాణ ప్రాజెక్టును చేపట్టేందుకు చైనాకు చెందిన నిర్మాణ సంస్థతో బుధవారం నేపాల్ ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను చైనా నిర్మాణ సంస్థ రూపొందించి సమర్పిస్తుందని ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మే యర్ బైద్య సుందర్ షాక్య తెలిపారు. ఆయనతోపాటు విలేఖరుల సమావేశంలో చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ డైరెక్టర్, విదేశీ వాణిజ్య వ్యవహారాల శాఖ అధికారి ఝూవోగుయాంగ్‌బింగ్ పాల్గొన్నారు. అం తకుముందు వీరు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఏడాదిలోగా సమగ్ర పరిశీలన పూర్తిచేసి నివేదికను అందిస్తామని గుయాంగ్ బింగ్ తెలిపారు. ప్రాథమిక పరిశీలన మేరకు ఖాట్మండులోని 27 కిలోమీటర్ల మోనోరైలు ప్రాజెక్టుతోసహా రింగ్ రోడ్డు నిర్మాణాన్ని 116 బిలియన్ రూపాయల ఖర్చుతో చేపట్టాలని అంచనా వేయడం జరిగిందన్నారు. ప్రాజెక్టును ప్రారంభించిన నాటినుంచి మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామని ఖాట్మండు డిప్యూటీ మేయర్ హరిప్రభ ఖాడ్గీశ్రేష్ట వివరించారు. ఈ బృహత్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, ఇందుకు సంబంధించిన ఖర్చు మొత్తం చైనా కంపెనీ భరిస్తుందని తెలిపారు. ‘నిర్మించు, సొంతం చేసుకో, నిర్వహించు’ (బీఓఓటీ) పథకం ద్వారా ఈ కంపెనీకి కాంట్రాక్టును అప్పగిస్తున్నామన్నారు.