అంతర్జాతీయం

పాక్ సామాజికవేత్తకు యూఎన్ మానవ హక్కుల అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, డిసెంబర్ 19: పాకిస్తాన్‌లోని పీడిత మైనారిటీల హక్కులు, మతపరమైన ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేసిన సామాజికవేత్త, విమర్శకురాలు ఆస్మా జహంగిర్‌కు ఐక్యరాజ్య సమితి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన మానవహక్కుల అవార్డు ఆమె మరణాంతరం లభించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆమె తరఫున ఆమె కుమార్తె మునిజా జహంగిర్ అవార్డును ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మరియా ఫెర్నాండా ఎస్పినోసా చేతుల మీదుగా అందుకున్నారు. 1968నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును 2018 సంవత్సరానికి సంబంధించి ఆస్మాజహంగీర్‌కు ఆమె మరణాంతరం ప్రకటించారు. మైనారిటీల హక్కుల కోసం, ఉగ్రవాదంపై పోరాటం చేసిన జహంగీర్ జనవరి, 1952లో లాహోర్‌లో జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బి డిగ్రీ పొందిన తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టులలో అడ్వకేట్‌గా పనిచేశారు. తర్వాత పాకిస్తాన్‌లో సహవ్యవస్థాపకురాలిగా హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను స్థాపించి దానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. మానవహక్కుల కోసం ఆమె అలుపెరుగని పోరాటం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన 66వ ఏట అనారోగ్యంతో కన్నుమూసారు.
అవార్డు ప్రదాన కార్యక్రమానికి టాంజానియాకు చెందిన బాలిక విద్యా హక్కుల పరిరక్షకురాలు రెబెకాగ్యూమీ, బ్రెజిల్‌కు చెందిన మొదటి మహిళా న్యాయవాది జోనియా బట్టిసస్టా తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుట్టెరస్ మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియడానికి అందరూ సమష్టి ప్రయత్నాలు చేయాలని అన్నారు. మానవహక్కుల గురించి పోరాడటం అంత సులభమేమీ కాదని, వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయని, వారిని పలువురు విమర్శించడం, దూషించడమే కాక, హత్య చేయడం, కిడ్నాప్ చేయడం, వేధించడం, జైళ్లకు పంపడం లాంటివి చేయడం మనం వింటుంటామని, అయినా అటువంటి వాటికి మానవహక్కు పరిరక్షకులు వెరవక మొక్కవోని దీక్షతో, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని ఆమె ప్రశంసించారు. వీరి ధైర్యం, తెగువ వల్ల ప్రపంచంలో ఎక్కడైతే మానవహక్కులకు భంగం ఏర్పడి అంధకారంలో ఉండిపోయిన పలు ప్రదేశాల్లో వెలుగులు నిండుతున్నాయని అన్నారు. ఆర్థిక, పౌర, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఇలా అన్ని రంగాల్లో వీరి ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు.
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై పోరాడాలని, అలాగే మహిళల సాధికారితకు కృషి చేయాలని ఆమమె సూచించారు. అందరి మానవహక్కులను పరిరక్షించడమే శాంతికి మార్గమని యూఎన్ హ్యూమన్ రైట్స్ హై కమిషనర్ మిచెల్లె బాచెలెట్ పేర్కొన్నారు. కాగా ప్రతిష్టాత్మకమైన యూఎన్ మానవహక్కుల అవార్డును గతంలో ప్రముఖులు రూజ్‌వెల్ట్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, జిమీకార్టర్, మలాల, ఈ సంవత్సరం నోబెల్ బహుమతి గ్రహీతలైన డెన్నిస్ ముఖ్‌వెగె, నదియా మురద్ అందుకున్నారు.