అంతర్జాతీయం

భారతీయ విద్యార్థుల అరుదైన ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హౌస్టన్, డిసెంబర్ 20: ప్రపంచ జ్ఞానంతోబాటు, శాస్త్ర పరిజ్ఞానంలో అత్యంత ప్రతిభావంతులైన 25 మంది విద్యార్థుల జాబితాలో భారతీయ మూలాలున్న ముగ్గురు విద్యార్థులకు స్థానం దక్కింది. 2018 సంవత్సరానికి గాను టైమ్స్ మ్యాగజైన్ 19 సంవత్సరా లోపు వయసుగల అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల జాబితాను గురువారం విడుదల చేసింది. భారతీయ అమెరికన్లు కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, ఆంగ్లో ఇండియన్ అమికా జార్జిలు ఈ ఘనత దక్కించుకున్నారు. వీరు తమ పనితీరు, ఔన్నత్యంతో అద్భుతమైన లక్ష్యాన్ని సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఎనిమిదోగ్రేడ్ విద్యార్థి రిషబ్ ‘ఆల్గారిథమ్’ అనే విధానాన్ని ఆవిష్కరించి అందరి శాస్తవ్రేత్తల మన్ననలను అందుకున్నాడు. ఈ విధానం ద్వారా పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నయం చేయవచ్చు. అలాగే హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఇటీవలే చేరిన కావ్య కొప్పరపు అత్యంత లోతైన అధ్యయనానికి దోహదపడే కంప్యూటర్ సిస్టంకు రూపకల్పన చేసింది. గ్లియోబ్లస్టోమా వంటి భయంకరమైన మెదడు క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశాలను ఈ విధానం మరింతగా పెంచింది. 30 సంవత్సరాల కాలంగా ఇలాంటి విధానం ఎవరూ కనుగొనలేదని విజాన శాస్తవ్రేత్తలు కితాబిచ్చారు. మృత్యుముఖంలో ఉండే ఇలాంటి రోగులకు సమగ్రమైన లక్ష్యంతోకూడిన థెరపీని అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుందని టైం మ్యాగజైన్ వివరించింది. ఇక ఇంగ్లాండ్‌కు చెందిన అమికా జార్జి మహిళల ప్రగతికి పగ్గాలు వేస్తున్న ‘పీరియడ్ పావర్టీ’ని పారదోలే విషయంలో విధాన నిర్ణయాలు చేసే వారికి సరైన దృక్పథాన్ని చూపేందుకు కృషి చేస్తోంది.