అంతర్జాతీయం

సంక్షోభంలో అమెరికా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 22: అమెరికా ప్రభుత్వం శనివారం పాక్షికంగా సంక్షోభంలో పడింది. ఫెడరల్ చెల్లింపులకు సంబంధించిన బిల్లు, అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించాలన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనకు నిధుల కేటాయంపులకు సంబంధించి చట్టసభ కాంగ్రెస్‌తో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ బిల్లును ఆమోదించకుండానే అమెరికా కాంగ్రెస్ వాయదా పడింది. కాంగ్రెస్ సభ్యులను ఒప్పించేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నం విఫలమైంది. డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల నేతలతో వైట్‌హౌస్ అధికారులు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేకపోయంది. కేవలం అత్యంత కీలకమైన భద్రతా ఏజెన్సీలు మాత్రమే పని చేస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయ. ఈ బడ్జెట్ కేటాయంపు వివాదం దేశ రాజధానిపైన కూడా పడినట్టు చెప్తున్నారు. ఇలావుంటే, సరిహద్దుల్లో గోడలు నిర్మించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదనపై చర్చించకుండానే క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ సభను వాయిదా వేసింది. సభ వాయిదా పడే వరకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రతినిధుల మధ్య సరిహద్దుల్లో గోడల నిర్మాణంపై మంతనాలు జరిగాయి. శే్వత సౌధం ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిసన్ రాజీనామా నిర్ణయంతో ఈ ప్రతిపాదనలన్నీ వెనక్కు వెళ్లాయి. జిమ్ మాటిసన్ రాజీనామా వార్త వెలువడడంతో వాల్ స్ట్రీట్‌లో చిన్నబోయింది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది. ట్రంప్ ప్రతిపాదనలు, వాటి అమలు సంగతి పక్కనపెడితే, దుందుడుకు తనంతో తీసుకునే నిర్ణయాల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే దిశగా పయనిస్తోందని డెమాక్రటిక్ నేత చుక్ షూమర్ తెలిపారు. అమెరికాలోకి అక్రమంగా శరణార్థులు చొరబడకుండా ఐదు బిలియన్ డాలర్లతో మెక్సికో సరిహద్దుల్లో గోడను నిర్మించాలని డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను డెమాక్రట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఇంతవరకు మూడు సార్లు చర్చించినా, అధికార, విపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. హౌస్, సెనెట్‌లో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉంది. దీంతో ట్రంప్ తన పార్టీ వారే తనను గట్టెక్కిగస్తారని ఆశలు పెట్టుకున్నారు. కాని జనవరిలో జరిగే ఈ సభల సమావేశం నాటికి కూడా సరిహద్దుగోడల సమస్య కొలిక్కివస్తుందనే గ్యారంటీ లేదు. కాంగ్రెస్‌తో పాటు అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వైఖుల వల్ల 8 లక్షల మందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అమెరికా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లారుూస్ జాతీయాధ్యక్షుడు డేవిడ్ కాక్స్ తెలిపారు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడల నిర్మాణంపై రిపబ్లికన్లు,డెమాక్రట్ల మధ్య సయోధ్య కుదరలేదు. దీనిపై వైట్‌హౌస్ ప్రతినిధులు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్సీ, ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నీర్‌లు తెరవెనక ముమ్మర ప్రయత్నాలు, లాబీయింగ్ చేస్తున్నారు