అంతర్జాతీయం

నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పనామా పేపర్స్ కుంభకోణంలోని మరో కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవినీతి కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష, 2.5 మిలియన్ యూఎస్ డాలర్ల జరిమానా విధిస్తూ అకౌంటబిలిటీ కోర్టు (జవాబుదారీ న్యాయస్థానం) సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే కోర్టు మరో కేసులో ఆయనను నిర్దోషిగా పేర్కొంది. పనామా కుంభకోణంకు సంబంధించి షరీఫ్‌పై మూడు కేసులు నమోదు కాగా, ఒక దానిలో ఇప్పటికే పదేళ్ల శిక్ష పడింది. రెండోకేసులో ఇప్పుడు ఏడేళ్ల శిక్ష పడగా, మరోదానిలో నిర్దోషిగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆల్-ఆజీజియా స్టీల్ మిల్స్ ఏర్పాటులో అవినీతికి పాల్పడ్డాడని షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారించిన అకౌంటబిలిటీ కోర్టు 2 జడ్జి మాలిక్, మాజీ ప్రధాని షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలు రుజువుచేసే గట్టి ఆధారాలు ఉన్నందున అతనికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. కాగా షరీఫ్‌పై ఫ్లాగ్‌షిప్ పెట్టుబడుల అవినీతికి సంబంధించిన కేసులో ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేశారు. తీర్పు సమయానికి కోర్టు వద్దే తన న్యాయవాదులతో ఉన్న షరీఫ్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిని రావల్పిండిలోని అడియాల జైలుకు తరలించారా? లేక రాహోర్‌లోని కోట్‌లఖాపుట్ జైలుకు తరలించారో అధికారులు నిర్ధారించ లేదు. ఈ తీర్పులపై పై కోర్టుకు వెళ్లవచ్చునని న్యాయస్థానం పేర్కొంది.
ఇలావుండగా నవాజ్‌షరీఫ్‌పై నమోదైన పనామా కుంభకోణానికి సంబంధించిన కేసులో అతను దోషి అని సుప్రీం కోర్టు జూలై 2017లో పేర్కొనడంతో ఆయన అదే సంవత్సరం సెప్టెంబర్‌లో పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది జూలైలో షరీఫ్, అతని కుమార్తె మరియమ్, అల్లుడు ఎం.సఫదార్‌లు లండన్‌లో అక్రమంగా లగ్జరీ ఫ్లాట్లు పొందారనే కేసులో 11 ఏళ్లు, ఎనిమిదేళ్ల శిక్ష పడటంతో వారిని జైలుకు పంపారు. తర్వాత సెప్టెంబర్‌లో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారు విడుదలయ్యారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన షరీఫ్‌పై ఉన్న మూడు కేసులను డిసెంబర్ 24లోగా విచారణ ముగించాలని సుప్రీం కోర్టు డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో మిగిలిన రెండు కేసులకు సంబంధించి సోమవారం తీర్పు వెలువరించారు.
షరీఫ్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కోర్టు ఆవరణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) మద్దతుదారులు పలువురు కోర్టు బయట వేచి ఉన్నారు. తీర్పు షరీఫ్‌కు వ్యతిరేకంగా రావడంతో వారు కోర్టులోపలికి చొచ్చుకురావడానికి ప్రయత్నించగా, వారిని చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు, లాఠీలను ప్రయోగించారు. తీర్పు వెలువడకముందు షరీఫ్ విలేఖరులతో మాట్లాడుతూ ‘నేను దేనికీ భయపడను.. దేనికైనా తలవంచడానికి నా మనస్సాక్షి అంగీకరించదు.. దేశానికి చిత్తశుద్ధితో, నిజాయితీతో సేవలదించడానికి కృషి చేశా’ అని పేర్కొన్నారు. ఇలావుండగా ఈ మూడు కేసుల్లోనూ షరీఫ్ ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ కూడా నిందితులే. అయితే ఈ కేసులకు సంబంధించి వారు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాకపోవడంతో వారిని పరారీలో ఉన్న నిందితులుగా కోర్టు ప్రకటించింది.