అంతర్జాతీయం

వచ్చే యోగా డే నాటికి ఐరాస స్టాంప్ విడుదల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, జూలై 11: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేయాలని ఐక్య రాజ్యసమితి యోచిస్తోంది. ఏటా జూన్ 21న యోగా దినోత్సవంగా పాటించాలంటూ భారత్ చేసిన తీర్మానానికి ఐరాస ఆమోదం లభించడం, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది యోగా దినోత్సవం నాడు ప్రత్యేక స్టాంప్ విడుదల చేయాలని ఐరాస పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. న్యూయార్క్, వియన్నా, జెనివాల్లోని కార్యాలయాల్లో ఏకకాలంలో స్టాంపులు విడుదల చేస్తారు. గత నెలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐరాస సచివాలయ భవనం ఎదుట 135 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఐరాస జనరల్ అసెంబ్లీ స్పీకర్ మోగెన్స్‌లెకెక్ట్ఫా లక్ష్యాలను చేరుకోడానికి యోగా ఉపయోగపడుతుందని చెప్పారు.