అంతర్జాతీయం

సునామీ మృతులు 281

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరిటా (ఇండోనేషియా), డిసెంబర్ 24: ఆకస్మాత్తుగా రాత్రికి రాత్రి విరుచుకుపడి విలయాన్ని సృష్టించిన సునామీ వల్ల ఇండోనేషియాలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సునామీ వల్ల మృతి చెందిన వారి సంఖ్య ఆదివారానికి 222 ఉండగా, సోమవారానికి అది 281కు పెరిగింది. ఇది ఇంకా పెరగవచ్చునని ఆ దేశ అధికారులు ప్రకటించారు. కాగా సునామీ వల్ల వెయ్యి మందికి పైగా గాయపడగా, వేలాది ఇళ్లు, వాణిజ్యా సంస్థలు నేలకూలాయి. కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఇంకా శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండగా, వారిని బయటకు తీయడానికి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం పేలడం వల్ల సంభవించిన సునామీ వల్ల రాకాసి అలలతో ఎగసిపడిన సముద్రం శనివారం రాత్రి హఠాత్తుగా విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలోని సమత్రా, జావా ప్రాంతాల్లోని బీచ్‌లలో వీకెండ్ సంబరాల్లో మునిగి తేలుతున్న వారిని రాకాసి అలలు చుట్టుముట్టాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చాలామంది జలసమాధి అయ్యారు. కెరిటా బీచ్ సమీపలోని పలు భవనాలు వీటి ధాటికి పేకమేడల్లా కూలిపోయాయి. సునామీ తర్వాత ఈ ప్రాంతం బీభత్సంగా తయారైంది. భవనాలు, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని డిజాస్టర్ ఏజెన్సీకి చెందిన ప్రతినిధి సుటోపో పురో తెలిపారు. దెబ్బతిన్న ప్రాంతాలలో మిలటరీ, పోలీస్ బలగాలు పునరావాస చర్యలు చేపట్టాయని ఆ ఏజెన్సీకి చెందిన సీనియర్ అధికారి రోడి రుస్వండి చెప్పారు. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో సోమవారం బాధిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ ఏడాది తమ దేశానికి సంభవించిన మూడో పెను ప్రకృతి విపత్తు అని ఆయన వివరించారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో లాంబక్ దీవిలో వరుసగా వచ్చిన భూకంపం, సెప్టెంబర్‌లో సలవెసి ద్వీపంలో వచ్చిన సునామి, భూకంపం వల్ల 2200 మంది మృతి చెందారని, వేలాది మంది కన్పించకుండా పోయారని, ప్రకృతి తమపై పగబట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండోనేషియాలో భయానక సునామీకి కారణమైన అగ్నిపర్వత విస్పోటక దృశ్యమిది. జావాఖాతంలో
వున్న అనక్ క్రకటావు అగ్నిపర్వతం నుంచి పెల్లుబుకుతున్న మంటలు, ఉప్పొంగుతున్న లావా