అంతర్జాతీయం

కాబూల్ రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, డిసెంబర్ 25: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. ప్రభుత్వ ప్రహరీ గోడను దూసుకుని లోపలికెళ్లి నరమేధం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 43 మంది మరణించారు. ఇది అత్యంత కిరాతకమైన మారణహోమం సృష్టించిన దాడి అని అఫ్గనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనతో ఆఫ్గనిస్తాన్ వ్యాప్తంగా అప్రమత్తం ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు మాజీ సైనికులకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వ భవనాల చుట్టూ ఉన్న ప్రహరీ గోడను దాటుకుని రావడానికి ప్రయత్నించారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులు గంటసేపు సాగాయి. కాల్పుల తాకిడికి భవనాలు దద్దరిల్లాయి. గోడలు బీటలు వారాయి. ప్రభుత్వ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వందలాది మంది ఉద్యోగులు భవనాల్లో నుంచి బయటకు రాలేదు. నలుగురు ఉగ్రవాదులతో పాటు మొత్తం 43 మంది కాల్పుల్లో మరణించారు. మరణించిన వారిలో పౌరులు ఎక్కువ మంది ఉన్నారు. గత నెలలో మతప్రార్థనలు జరుగుతున్న ప్రదేశంపై ఒక ఉగ్రవాది ఆత్మహతిదాడి చేసిన ఘటనలో 55 మంది మరణించిన విషయం విదితమే.
అఫ్గనిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అబ్దుల్లా అబ్దుల్లా మాట్లాడుతూ ఈ ఉగ్రవాద దాడికి తాలిబాన్లు కారణమని ఆరోపించారు. తాలిబాన్లు దాడి జరపడం వల్ల సామాన్య ప్రజలు మరణిస్తున్నారన్నారు. వీరి ఏరివేత పూర్తయ్యేవరకు విశ్రమించమన్నారు. ఈ ఏడాది తాలిబాన్లు నిరంతరం దాడులతో దేశంలో చాలా భూభాగాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కాగా అమెరికా ప్రభుత్వం అఫ్గనిస్తాన్ భూభాగాల నుంచి తమ సైన్యాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాలిబాన్లను ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన సైన్యాన్ని కీలకమైన ప్రదేశాల్లో నియమించారు. అమెరికా తన సేనలను ఉపసంహరించుకునే పక్షంలో దేశం మళ్లీ తాలిబాన్ల ఆధీనంలోకి వెళుతుందని ప్రజలు ఆందోళనతో ఉన్నారు. సైన్యం ఉపసంహరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నుంచి తమకు ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదని జనరల్ స్కాట్ మిల్లర్ ప్రకటించారు. తాలిబాన్లు కాబూల్‌ను హస్తగతం చేసుకునే పక్షంలో దేశంలో రక్తపాతం తప్పదని అంతర్యుద్ధం తీవ్రమవుతుందని సైనిక నిపుణులు భావిస్తున్నారు.

చిత్రం..ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించింది ఈ భవనంలోకే